Advertisement

Advertisement


Home > Articles - Special Articles

రాశిఫలాలు.. 09.08.20 నుంచి 15.08.20 వరకు

రాశిఫలాలు.. 09.08.20 నుంచి 15.08.20 వరకు

మేషం: ఉత్సాహవంతంగా చేపట్టిన కార్యాలు పూర్తి చేస్తారు. ముఖ్యంగా వైద్యులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వాహన, గహయోగాలు సిద్ధిస్తాయి.ఆర్థికం...అనుకున్నంత ఆదాయం సమకూరడంతో అప్పులు చాలావరకూ తీరతాయి. చేతినండా సొమ్ములు సమకూరడం విశేషం. కుటుంబం...కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. భార్యాభర్తల మధ్య వివాదాలు కాస్త తొలగుతాయి. మీమీద బంధువులు ఉంచిన విశ్వాసాన్ని నిలుపుకుంటారు. స్థిరాస్తి పంపకాలలో సోదరులతో అంగీకారానికి వస్తారు. ఆరోగ్యం... ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త పాటించండి వ్యాపారాలు అభివద్ధిపథంలో కొనసాగుతాయి.  ఉద్యోగస్తులు అనుకున్న మారు’లు పొందుతారు. అలాగే, కొత్త బాధ్యతలు, విధులు ఉత్సాహాన్నిస్తాయి. పారిశ్రామికవేత్తలకు మరింత అనుకూల సమయమనే చెప్పాలి. మహిళల యత్నాలు సఫలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృషభం: ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. ఆలోచనలు అమలు చేస్తారు. ప్రస్తుత సమయంలో సైతం అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు కలసివస్తాయి. ఆర్థికం.. సొమ్ముకు ఇబ్బంది తొలగుతుంది. రెండు మూడు విధాలుగా ధనలబ్ధి ఉండవచ్చు. కుటుంబం.. బంధు వులు మీపై మరింత ఆదరణచూపుతారు. సంతాన పరంగా మీపై వచ్చిన ఒత్తిడులు తొలగుతాయి. ఒకరి వివాహ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.  భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగుతాయి. ఆరో గ్యం.. కాస్త మెరుగ్గా ఉంటుంది. అయితే వైద్యసేవలు కొనసాగిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుం టాయి. పెట్టుబడులు తగినంతగా అందుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో  ఉద్యోగులకు కీలక సమాచారం కాస్త సంతోషం కలిగిస్తుంది. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. కళాకారులు అనుకున్నది సాధిస్తారు. మహిళల ఆశయాలు నెరవేరతాయి. శివాలయంలో  ఆవునేతి దీపం వెలిగించండి. 

మిథునం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. యుక్తితో కొన్ని  సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికం...రావలసిన సొమ్ము మొత్తం మీద చేతికందుతుంది. ఈతిబాధలు తొలగుతాయి. కుటుంబం... ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. సోదరులు, సోదరీలతో ఒప్పందాలు చేసుకుంటారు. సంతానపరంగా మరింత అనుకూలత ఉంటుంది. మీపై వచ్చిన అపవాదులు తొలగించుకునేందుకు యత్నిస్తారు. ఆరోగ్యం...మరింత మెరుగుదల కనిపిస్తుంది. వైద్యసేవలు తగ్గిస్తారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు కొంత  ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామివేత్తలు, నాయకులకు క్లిష్టసమస్యలు తొలగుతాయి. మహిళలకు స్వల్ప ధనలబ్ధి. వేంకటేశ్వరస్వామిని ఆరాధించండి. 

కర్కాటకం: కొన్ని పనులు ఎవరి సహాయం లేకుండా స్వశక్తితో పూర్తి చేస్తారు. ప్రస్తుత పరిస్థితులు నుకూలించ కున్నా అనుకున్న విజయాలు సాధిస్తారు. సోదరులు,శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. సమాజంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికం... ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. రుణాలు తీరతాయి. ఆకస్మిక ధనలబ్ధి ఆశ్చర్యపరుస్తుంది. కుటుంబం...అందరి ప్రేమాభిమానాలు పొందుతారు. సంతానం నుంచి అందిన సమాచారంతో ఊరట లభిస్తుంది. ఆరోగ్యం...ఎంతోకాలంగా ఎదుర్కొంటున్న ఆరోగ్యసమస్య తీరుతుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగస్తులు విధుల్లో ఆటంకాలు తొలగి ఊరట లభిస్తుంది. కళాకారులకు ఎట్టేకలకు తిరిగి పూర్వవైభవం సిద్ధిస్తుంది. మహిళల ఆకాంక్షలు, ఆశయాలు నెరవేరతాయి. లక్ష్మీనసింహ కరావలంబం పఠించండి. 

సింహం: కొన్ని వివాదాల నుంచి ఎట్టేకలకు బయటపడతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆర్థికం...ఆర్థిక విషయాలు కొంత మందగించినా అవసరాలు తీరతాయి. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. ఆస్తులపై పెట్టుబడులు పెడతారు. కుటుంబం...కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. సోదరులతో ఎంతోకాలంగా ఎదుర్కొంటున్న ఒక వివాదం పరిష్కరించుకుంటారు. శుభకార్యాలపై కొన్ని నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. ఆరోగ్యం...ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. అయితే మధ్యలోకొంత ఉపశమనం కలుగుతుంది. వ్యాపారాల విస్తరణలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగులు అదనపు విధులు  చేపట్టాల్సిన సమయం.. పారిశ్రామివర్గాలకు ఆహ్వానాలు ఉత్సాహాన్నిస్తాయి. మహిళలకు కొద్దిపాటి ఆస్తిలాభ సూచనలు. హనుమాన్ చాలీసా పఠించండి.

కన్య: మిత్రులతో విభేదాలు తొలగుతాయి. చిరకాల ప్రత్యర్థులను సైతం నేర్పుగా ఆకర్షిస్తారు. వాహనాల విషయంలో కాస్త మెలకువ అవసరం. మీపై వచ్చిన అపవాదుల నుంచి బయటపడతారు. ఆర్థికం...రావలసిన సొమ్ము అందుతుంది. రుణబాధల నుంచి విముక్తి. షేర్లలో పెట్టుబడులు పెడతారు. కుటుంబం...భార్యాభర్తల మధ్య ఆపార్ధాలు తొలగుతాయి. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వివాహయత్నాలు ముమ్మరం చేస్తారు. బంధువర్గం నుంచి అనుకూల సమాచారం అందుకుంటారు. ఆరోగ్యం..కొంత నలత చేసి ఉపశమనం పొందుతారు. వైద్యసేవల నుంచి విముక్తి. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరి ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులు విధుల్లో చిక్కులు తొలగుతాయి. పైస్థాయి వారి ప్రోత్సాహం అందుతుంది. కళాకారులకు అనుకోని ఆహ్వానాలు రాగలవు. మహిళలకు విశేష ఆదరణ లభిస్తుంది. శివస్తోత్రాలు పఠించండి.

తుల: కార్యదీక్షాపరులై విజయాలు సాధిస్తారు. కొందరికి  పట్టింది బంగారమే. చాకచక్యంగా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆర్థికం...ఆకస్మిక ధనలాభం. శుభకార్యాలకు డబ్బు  ఖర్చు చేస్తారు. భూములు, షేర్లపై పెట్టుబడులు పెడతారు. కుటుంబం... జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు. కుటుంబసభ్యులు మీ మాటకు ఎదురుచెప్పరు. మీ నిర్ణయమే శిరోధార్యంగా భావిస్తారు. ఆరోగ్యం...గతం నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగుతాయి. పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారతారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు, మరింతగా లాభాలు తథ్యం. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. ఉన్నత పోస్టులు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు కొత్త సంస్థలపై కార్యాచరణ రూపొందిస్తారు. మహిళలకు ఆస్తిలాభ సూచనలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వశ్చికం: ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. సేవాకార్యక్రమాలపై దష్టి సారిస్తారు. ఆర్థికం...అవసరాలకు తగినంతగా సొమ్ము అందుతుంది. ఊహించని రీతిలో స్నేహితుల నుంచి ధనలబ్ధి. రుణబాధలు కాస్త తొలగుతాయి. కుటుంబం.. అందరి ఆదరణ పొందుతారు. భార్యాభర్తల మధ్య సయోధ్య ఏర్పడుతుంది. సంతానపరంగా శుభవార్తలు అందుతాయి. యుక్తితో బంధువుల సమస్యలు సైతం పరిష్కరిస్తారు. ఆరోగ్యం.. కొంత నలత తప్పకపోవచ్చు. అయినా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు విధుల్లో ప్రశంసలు అందుతాయి. ఉన్నతాధికారులు మీపై మరిన్ని బాధ్యతలు ఉంచుతారు. పారిశ్రామిక,వైద్యరంగాలవారికి నూతనోత్సాహం. మహిళల కషి ఫలిస్తుంది.  అంగారకస్తోత్రం పఠించండి. 

ధనుస్సు: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. చేపట్టిన కార్యక్రమాలు విజయాల దిశగా సాగుతాయి. ప్రస్తుత పరిస్థితులను ్కసైతం అధిగమించి లక్ష్యసాధన దిశగా సాగుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. ప్రత్యర్థులు కూడా మీపై ప్రత్యేక అభిమానం చూపడం విశేషం. ఆర్థికం...అనూహ్యంగా సొమ్ము అందడం విశేషం. మీ అవసరాలకు ఏమాత్రం లోటు రాకుండా ఉంటుంది. కుటుంబం...సోదరీలు, సోదరుల ప్రేమాభిమానాలు పొందుతారు. వివాహాది శుభకార్యాలపై దష్టి సారిస్తారు. సంతానపరంగా చికాకులు తొలగుతాయి. ఆరోగ్యం...స్వల్ప రుగ్మతలు నెలకొంటాయి. వైద్యసేవలు పొందుతారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత ెదాలు లభించవచ్చు. రాజకీయవర్గాలకు పదవులు లభించవచ్చు. హిళలకు ఆస్తిలాభ సూచనలు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

మకరం: కష్టసాధ్యమైన పనులు కూడా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సాహిత్య, సంగీత విషయాలపై ఆసక్తిచూపుతారు. దార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికం...ప్రస్తుత పరిస్థితులు అనుకూలించకున్నా మీకు రావలసిన సొమ్ము అందుతుంది. కొన్ని రుణబాధలు తొలగి ఊరట చెందుతారు. షేర్ల విక్రయాలలో లాభాలు గడిస్తారు. కుటుంబం...కుటుంబసభ్యుల చేయూత అందుతుంది. కుటుంబపరంగా  కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల నుంచి శుభవార్తలు. సంతాన ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆరోగ్యం...స్వల్ప అనారోగ్యం, వైద్యసేవలు పొందుతారు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి, పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి. పారిశ్రామికరంగం వారు అన్ని విధాలా అనుకూల సమయం. మహిళలకు ఆలోచనలు కలసివస్తాయి. గణేశ్ స్తోత్రాలు పఠించండి.

కుంభం: నిర్ణయాలలో కొంత జాప్యం తప్పదు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగులు శ్రమకు తగిన ఫలితం కనిపించక డీలాపడతారు. ఇంటి నిర్మాణయత్నాలు ముందుకు సాగవు. ఆర్థికం...ఆర్థిక విషయాలు అంతగా అనుకూలించక రుణాలు చేస్తారు. అనుకోని ఖర్చులు మీదపడి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. షేర్ల విక్రయాలు నిలిచిపోయి కొంత నిరుత్సాహపడతారు. కుటుంబం...నా అనుకున్న వారే సమస్యలు సష్టించే వీలుంది. బంధువులతో అకారణంగా తగాదాలు. సంతానం ఆరోగ్యంపై కొంత కలత చెందుతారు. ఆరోగ్యం... ఆరోగ్యసమస్యలు వేధిస్తాయి. ఔషధసేవనం తప్పదు. వ్యాపారాలలో నిదానంగా ముందుకు సాగడం మంచిది. ప్రస్తుత పరిస్థితులు సవాలుగా మారతాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో ప్రతి క్షణం అప్రమత్తంగా మెలగాలి. కళాకారుల యత్నాలు ముందుకు సాగవు. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి. 

మీనం: చేపట్టిన ముఖ్య కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి.  కొత్త కాంట్రాక్టులు చేపడతారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. భూములు, వాహనాలు కొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. పలుకుబడి పెరుగుతుంది. సమాజసేవలో పాల్గొంటారు. ఆర్థికం...రావలసిన డబ్బు అందుతుంది. అప్పులు కొంత తీరతాయి. ఆస్తుల విక్రయాలు లాభించి కొంత సొమ్ము అందుతుంది. కుటుంబం...బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. సంతానపరంగా నెలకొన్న సమస్యలు తీరతాయి. వివాహయత్నాలు కలసివస్తాయి. ఆరోగ్యం...ఎంతోకాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాలలో గందరగోళం తొలగు తుంది. విస్తరణ యత్నాలు సఫలం. లాభాలు అందు తాయి. ఉద్యోగులకు ఊహించని మార్పులు ఉండ వచ్చు. రాజకీయవేత్తలకు అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

Vakkantham Chandra Mouli 
www.janmakundali.com

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?