Advertisement

Advertisement


Home > Articles - Special Articles

శేషేంద్ర పుస్తకంపై పవర్ స్టార్ అభిమానం

శేషేంద్ర పుస్తకంపై పవర్ స్టార్ అభిమానం

ఆ మధ్య పవన్ కళ్యాణ్ మీడియాకు ఇంటర్వూలు ఇచ్చినపుడు వెళ్లిన వారికి ఆయన టేబుల్ పై వున్న ఓ పుస్తకం ఆకర్షించింది. ఆ పుస్తకం పేరు ఆధునిక మహా భారతం. రచయిత గుంటూరు శేషేంద్ర శర్మ. సాహిత్యం టచ్ వున్నవారికి ఈయనను పరిచయం చేయక్కరలేదు. సినిమా రంగంతో కూడా ఆయనకు టచ్ వుంది. 

దర్శకుడు బాపు, రచయిత రమణలకు ఈయనంటే మహాభిమానం. పట్టుబట్టి ముత్యాల ముగ్గు సినిమాలో 'నిదురించే తోటలోకి..పాట ఒకటి వచ్చింది' అనే పాటను రాయించారు. అదే ఆయన రాసిన ఒకే ఒక సినిమా పాట. అయితే మళ్లీ పాయింట్ కు వస్తే..ఆయన రాసిన ఆధునిక మహా భారతం పుస్తకం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు నచ్చేసింది. అది ఆయన దృష్టికి ఎలా వెళ్లిందీ అంటే అది మరో కథ. చాలా కాలం క్రితం రోడ్డు పక్క సెకెండ్ హ్యాండ్ పుస్తకాలు చూస్తుంటే దర్శకుడు త్రివిక్రమ్ కు కనిపించింది ఈ పుస్తకం. కొని చదివి పరవిశించిపోయారు. 

ఆ తరువాత ఎప్పుడో మాటల్లో తన సన్నిహితుడు పవన్ కు చెప్పారు. దాంతో ఆయన తీసుకుని చదివారు. కానీ ఈ పుస్తకం ఇప్పుడు ఎక్కడా పెద్దగా అందుబాటులో లేదని తెలిసి, వెంటనే శేషేంద్ర కుమారుడు సాత్యకిని పిలిచి, ఆర్ధిక సాయం అందించి, పాతిక వేల కాపీలు ప్రచురింపచేసారట. మరో కొద్ది రోజుల్లో ఈ పుస్తకాన్ని మార్కెట్ లోకి విడుదల చేస్తారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?