Advertisement

Advertisement


Home > Articles - Special Articles

శ్రీదేవి అంతిమ యాత్ర సాగుతుందిలా..

శ్రీదేవి అంతిమ యాత్ర సాగుతుందిలా..

ఎట్టకేలకు శ్రీదేవి భౌతికకాయం దుబాయ్ నుంచి ముంబయి చేరుకుంది. నిన్న రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ముంబయిలోని లోఖండ్వాలాలో ఉన్న బోనీకపూర్ ఇంటికి భౌతికకాయాన్ని తీసుకొచ్చారు.

కడసారి శ్రీదేవిని చూసేందుకు, ఈరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు అభిమానుల సందర్శనార్థం అంధేరిలోని లోఖండ్వాలా సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ లో భౌతిక కాయాన్ని ఉంచుతారు. ఆ తర్వాత అందర్నీ బయటకు పంపించేసి, కుటుంబ సభ్యులతో కలిసి బోనీకపూర్ గంట పాటు ప్రత్యేక పూజ చేస్తారు.

ప్రత్యేక పూజ అనంతరం మధ్యాహ్నం 3గంటల నుంచి శ్రీదేవి అంతిమయాత్ర ప్రారంభమౌతుంది. ముంబయిలోని విలే పార్లే శ్మాశనవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

ఎన్నో మలుపులు, సుదీర్ఘ నిరీక్షణ అనంతరం శ్రీదేవి మృతి కేసును కొట్టివేస్తున్నట్టు దుబాయ్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది. ఆమె మరణం వెనక ఎలాంటి నేరపూరిత కుట్ర లేదని ప్రాసిక్యూషన్ అధికారులు తేల్చారు. అపస్మారక స్థితికి వెళ్లి బాత్ టబ్ లో మునిగి చనిపోయారని ప్రకటించారు. అయితే శ్రీదేవి అపస్మారక స్థితిలోకి ఎందుకు వెళ్లారనే విషయాన్ని మాత్రం ప్రాసిక్యూషన్ వెల్లడించలేదు.

కేసు మూసేసిన వెంటనే భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ శరవేగంగా ముగిసింది. దుబాయ్ నుంచి అనీల్ అంబానికి చెందిన ప్రత్యేక విమానంలో భౌతికకాయాన్ని ముంబయికి తీసుకొచ్చారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?