cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ఈ చేష్టల వల్ల మరింత దూరమౌతున్న కులం

ఈ చేష్టల వల్ల మరింత దూరమౌతున్న కులం

మాస్ హీరో సినిమా అంటే హడావిడి ఉండడం సహజం. కానీ హద్దూ అదుపూ లేకుండా ఒక కసితో హడావిడి చేస్తూ అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ జబ్బలు చరుచుకోవడం చూసినప్పుడే అసహజంగా అనిపిస్తుంది. 

సమాజంలో ఒక వర్గానికి ఎప్పుడైతే ఆత్మన్యూనత ఎక్కువౌతుందో అప్పుడు హడావిడి ఇంకా ఎక్కువ చేస్తారు. కంటెంట్ లేనప్పుడు కటౌట్ పెద్దది పెట్టుకుని మనసుని సవరదీసుకుంటారు. 

ఆంధ్రాలేదు, అమెరికాలేదు... అన్ని చోట్లా "ఆ ఒక్క సామాజిక వర్గం" ఆధ్వర్యంలో జరిగిన "అఖండ" హడావిడి చూస్తే ఆశ్చర్యపడాలనిపించదు గానీ నవ్వాలనిపిస్తుంది. 

తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి 14 కోట్లు షేర్ వచ్చేసిందని చాటుకున్నారు. దాంట్లో 4 కోట్లు నైజాం అన్నారు. అంటే మిగతాదంతా ఆంధ్ర, సీడెడ్ అనేగా!

ఇంతేసి కలెక్షన్ వచ్చేస్తే ఇక టికెట్ రేట్లు తగ్గాయని ఏడుపెందుకు? 

ఒకపక్కన టికెట్ రేట్ల గురించి గోల చేసేదీ వీళ్లే, మళ్లీ మావోడి సినిమా ఇరగదీసేస్తోందని కలెక్షన్లు తిరగరాసేస్తోందని కందిపోయేలా తొడలు బాదుకునేదీ వీళ్లే. 

ఒక టీవీ చానల్ అయితే ఏకంగా జగన్ కి షాకిచ్చిన బాలయ్య అంటూ హెడింగ్ పెట్టి స్వయంసుఖం పొందింది. రెండ్రోజులాగితే అసలు విషయం ఎలాగో బయటపడుతుంది. 

అసలిది హిందూధర్మం ముసుగులో వచ్చిన యాంటీసోషల్ సినిమా. అఘోరాగా మారిన వాడు ఎంతమందిని నరికేసినా కేసులుండవు, ఎన్.ఐ.ఏ ఏజెంటు కూడా ఏం పీకలేడు అనే అర్థం వచ్చేలా తీసిన చిత్రరాజం ఇది. 

80% రక్తపాతంతో నిండిపోయిన ఈ సినిమాకి వచ్చిందే బిలో ఏవరేజ్ టాక్. ఫ్యాన్స్ తప్ప అద్భుతం అన్నవాళ్లు ఎవరూ లేరు. అలాంటప్పుడు కలెక్షన్స్ ఎలా ఉంటాయి? 

సామాజిక వర్గ పెద్దలు షోలకి షోలు కొనేసి ఫ్రీగా చూపించారట కొన్ని చోట్ల.  ఈ పద్ధతితేదో మొత్తంగా చేసున్నా బాగుండేది. నిర్మాతకి మొత్తం డబ్బిచ్చేసి, రెండు రాష్ట్రాల్లోనూ, అమెరికాలోనూ థియేటర్లన్నీ డబ్బుకట్టి మూడు రోజులకి బ్లాక్ చేసేసి యావన్మంది ప్రజానీకానికి ఫ్రీ షో వేసేయొచ్చు కదా. 

ఏ సినిమాకి చేయనంత పిచ్చి హడావిడి ఒక్క ఈ సినిమాకే చేయడం వెనుకే ఉంది కులపిచ్చి ఏ స్థాయిలో ఉందో అని. ఇది ఒకరకంగా మిగతా కులాల్ని రెచ్చగొట్టడమే. వీళ్లిలా చేసారు కాబట్టి మనమిలా చెయ్యాలి అని మరొక హీరో కులపెద్దలు ఇదే వెర్రితనం చూపించొచ్చు. తెలుగువారి పరువుని అమెరికా వీధుల్లో రోడ్డున పాడేయొచ్చు. 

ఎంత చదువుకున్నా, ఎంత సంపాదించి ఏ దేశంలో ఉన్నా కొందరు "కనకపు సింహాసనమున శునకాన్ని" గుర్తుచేస్తుంటారు. సొంత కులానికే భ్రష్టత్వాన్ని తీసుకొచ్చేలా ప్రవర్తిస్తుంటారు. 

సినిమాని సినిమాగా కాకుండా రాజకీయ దృష్టితోటి, కులం దృక్పథం తోటి చూడడం..."అఖండ" ఆడేస్తే 2024లో తెలుగుదేశం గెలుపుకి నాంది అనుకోవడం పిచ్చికి పరాకాష్ట. 

ఈ "మావోడు" కాన్సెప్ట్ కి ఈ కులం ఎంత దూరంగా జరుగుతుందో మిగతా కులాల మనసులకి అంత దగ్గరగా చేరుతుంది. 

ఇలాంటి హడావిడి ఎన్.టి.ఆర్ బయోపిక్ అయిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలకి చేసినా అర్థం చేసుకోవచ్చు. అవి చారిత్రక చిత్రాల కోవలోకి వస్తాయి. అంతే కానీ ఒక మామూలు కల్పిత రక్తపాత చిత్రానికి ఈ గోల చేయడం హస్యాస్పదం.

ఇది తెలుసుకోకుండా స్వీయకులమర్దనం చేసుకుంటూ ఉన్నంతకాలం మిగతా కులాల వారందరికీ అసహ్యం కలుగుతూనే ఉంటుందన్నది వాస్తవం. 

హరగోపాల్ సూరపనేని

రమ్యకృష్ణ గారికి వయస్సు ఏమిటి?

హను రాఘవపూడి చాలా కష్ట పెడతాడు