మరణం ఎంత దారుణం.? 'ఇంకా నాకు బతకాలని వుంది..' అంటూ వేలాదిమంది, లక్షలాది మంది కొసప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నారు ఓ వైపు. ఇంకో వైపు, చావులో 'సుఖం' వెతుక్కుంటున్నారు ఇంకో వైపు.
ఈ మధ్యకాలంలో బలవన్మరణాలు చాలా వెరైటీగా వుంటున్నాయి. ఇంటర్నెట్ పుణ్యమా అని, చావడం ఎలా.? అన్నదానిపై చాలామంది రీసెర్చ్ చేసి మరీ, తమ ప్రాణాలు తామే తీసుకుంటున్నారు. మొన్నామధ్య మన హైద్రాబాద్‌లోనే ఓ వ్యక్తి, ఓ విషవాయువుని తెప్పించుకుని, మాస్క్ ద్వారా ఆ విషవాయువుని పీల్చి ప్రాణాలొదిలాడు. రసాయన కర్మాగారాల్లో వినియోగించే, ఆ రసాయన గాఢత, విషవాయువులా పనిచేసి, అతని ప్రాణాల్ని బలిగొంది. తన చావుకోసం వేలాది రూపాయలు ఖర్చు చేశాడతను.
తాజాగా, ఢిల్లీలో ఇలాంటిదే ఇంకో ఘటన జరిగింది. కార్బన్ మోనాక్సైడ్ సిలెండర్ తెప్పించుకుని, మాస్క్ అమర్చుకుని, ఆ కార్బన్ మోనాక్సైడ్‌ని పీల్చి, ప్రాణాలొదిలాడో టెకీ. ఎంత కష్టమొచ్చిందోనని జాలి చూపాలా.? చావులోనూ టెక్నాలజీని ఉపయోగించినందుకు అతన్ని చూసి సిగ్గుపడాలో అర్థం కాని పరిస్థితి. కష్టం ఎంత పెద్దదైనా కావొచ్చుగాక, దాన్ని అధిగమిస్తేనే జీవితం. అసలు జీవితమే వద్దనుకోవడం మూర్ఖత్వం. ఓ అధ్యయనంలో పెద్ద పెద్ద కారణాలకన్నా, చిన్న చిన్న కారణాలే ఆత్మహత్యల సంఖ్య పెరిగేలా చేస్తున్నాయట. క్షణికావేశం చాలా హత్యలకీ, ఆత్మహత్యలకూ కారణమవుతోంది.
చివరగా: చావడానికి రైలు పట్టాల్నీ, ఎత్తయిన ప్రదేశాల్నీ ఎంచుకోవడం ఓల్డ్ ఫ్యాషన్. టెక్నాలజీని ఉపయోగించడం లేటెస్ట్ ఫ్యాషన్. చావడమెలా.? అన్నదానిపై పెట్టే ఫోకస్, బతకడమెలా.? అన్నదానిమీద పెడితే, అసలంటూ బలవన్మరణాలే వుండవు. బతకడమెలాగో తెలిస్తే, చావాల్సిన అవసరమేముంటుంది.? అని తెలివిగా ప్రశ్నించేవాళ్ళకి సమాధానం చెప్పలేం.