ఎమ్బీయస్ – గ్రేట్ ఆంధ్రా ఆర్కయివ్స్ 2014 క్యూ 1

నా పాత ఆర్టికల్స్ వెతికేవారి సౌలభ్యం కోసం యీ బ్లాగ్ ఏర్పాటు చేయడం జరిగింది. 2009 నుంచి ఇప్పటిదాకా 12 సంవత్సరాల ఆర్టికల్స్‌కు ఏడాదికి 4 యూనికోడ్, 4 పిడిఎఫ్ చొప్పున ఫైళ్లు ఈ బ్లాగ్‌లో దొరుకుతాయి. 2009 ఉందనుకోండి. జనవరి నుంచి మార్చి Q1, ఏప్రిల్ నుంచి జూన్ Q2.. అలాగన్నమాట. ఫైలు మొదట్లో ఆ క్వార్టర్‌లో రాసిన ఆర్టికల్స్ జాబితా వుంటుంది. అది చూస్తే మీకు కావలసిన వ్యాసం దానిలో వుందో లేదో తెలిసిపోతుంది. యూనికోడ్‌ ఫైల్లో సెర్చింగ్ యీజీ. కానీ ప్రింట్ తీస్తే అందంగా రాదు. అందువలన ఇదే ఫైల్‌ను అను7లోకి మార్చి, పిడిఎఫ్ కూడా లభ్యం చేశామన్నమాట.

నేను 2015 మధ్యలో భగవద్గీతపై ఆర్టికల్ రాశానని, అది మళ్లీ చదివితే బాగుంటుందని తోచిందనుకోండి. ఆ ఏడాది క్యూ2 యూనికోడ్ ఫైళ్లలోకి వెళ్లి, వర్డ్ ఫైల్ కాబట్టి ‘ఫైండ్’ ఆప్షన్ ఎంచుకుని అక్కడ భగవద్గీత అని తెలుగులో టైపు చేస్తే (తెలుగులో టైప్ చేయడానికి జీమెయిల్‌లో కుడివైపు పైన ఇన్‌పుట్ టూల్స్ (పెన్ను బొమ్మ)లో తెలుగు ఎంచుకోవచ్చు. మెయిల్ కంపోజ్ చేస్తున్నట్లుగా టైపు కొట్టి దాన్ని కాపీ చేసి యిక్కడ పేస్ట్ చేయవచ్చు) ఆ ఫైల్ మొత్తంలో ఆ మాట ఎక్కడెక్కడుందో అదే కనిపెట్టి చూపించేస్తుంది. మీరు చదివాక నచ్చి, ప్రింట్ఔట్ తీసుకుందా మనుకుంటే పిడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేసి, కావలసిన పేజీ మాత్రం అచ్చు తీసుకోవచ్చు. ఉజ్జాయింపుగా అనుకున్న పీరియడ్ తప్పితే అదే ఏడాది క్యూ3 , పక్క ఏడాది క్యూ1… యిలా కాస్త వెతుక్కోవాలి.

ఈ ఫైల్‌లో వున్న ఆర్టికల్స్ విషయసూచిక…

సంగీతా రిచర్డ్స్‌కు మద్దతిచ్చినవారు, లోక్‌పాల్‌ బిల్లుకై సంతోషించాలా? బంగ్లాదేశ్‌ ఎన్నికలు సవ్యంగా జరుగుతాయా? తమిళనాడులో మరో తేజ్‌పాల్‌..? తిరువాన్కూర్‌ యువరాజు యిక లేరు, తమిళనాడులో ఎన్నికల పొత్తులు వుంటాయా? ఆప్‌ వాగ్దానాలు నీటిమూటలా? రోత పుడుతోంది, ఆప్‌ విజయం జెపికి కలిసివచ్చేనా? హైందవేతరులను పెళ్లాడిన హిందువులకు విడాకులు రావు, ఇది పెరోల్‌ సీజన్‌, ఆసాం స్టాండర్డ్‌ టైమ్‌, మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫ్లాట్ల యిక్కట్లు,

శుంఠ వ్యంగ్యమే’ అంటున్నారీ పండితుడు… శ్రీలంక జైళ్లల్లో భారతీయ జాలర్లు, సీమాంధ్రులు వెళ్లిపోతే హైదరాబాదు రోడ్ల మీద క్రికెట్‌, మంత్రిని మారిస్తే పరిశ్రమలు వస్తాయా? ఉత్తరాఖండ్‌లో పునరావాసం ఉత్తిదే, ‘ఆ సమయంలో తీసుకున్న నిర్ణయం సరిగా వుంటుందా?’ కుంభస్థలానికే గురిపెట్టిన ఆప్‌,

…అంజలీదేవి, సుచిత్రా సేన్‌, ఆప్‌ ‘అరాచకత్వం’, అక్కినేనికి నివాళి, అక్కినేనికి కీర్తి తెచ్చిన జానపద సినిమాలు, వీరభద్ర సింగ్‌ పదవికి భద్రత లేదు, వినోదాలూ – వివాదాలూ, ఆపరేషన్‌ బ్లూస్టార్‌కు బ్రిటిషు లింకు, బెంగాల్‌లో మరో బలాత్కారం కేసు, నితీశ్‌ కష్టాలు, ఏడో నిజాం ఎలాటివాడు? చంద్రబాబు హృదయం తెలిసేనా? ఆమ్‌ ఆద్మీ దృష్టి నీటిమీదే ఎందుకు? సునందా పుష్కర్‌ నిరాశలో ఎందుకు మునిగింది? కిరణ్‌ని తీసేయటం లేదేం? బిజెపి షాకిచ్చిందా? వాటే ఫాల్‌, జైపాల్‌!, రెండు కళ్ల కబోది, దేవయాని దౌత్యాధికారిగా మినహాయింపు వుందా? సునందకు ఆనందం కరువైంది, జయలలిత భారీ ప్రణాళికలు, బోరా పీఠాధిపత్యంలో వారసత్వ సమస్యలు

…మోదీకి వ్యతిరేకమైతే ఉద్యోగం వూడిందే.., మన కొత్త మిత్రుడు జపాన్‌!, జైనులు యిక మైనారిటీలు, విందుకా? నిందకా?, నాటకం క్లయిమాక్సుకి వస్తోంది, చంద్రుడి తారాబలం, తీగలాగి చూడు, షిండేపై ధ్వజమెత్తిన మాజీ హోం సెక్రటరీ, ”లగాన్‌” తరహా కథే… కానీ వాస్తవం, వాటికన్‌ను తప్పుపట్టిన యునైటెడ్‌ నేషన్స్‌ కమిటీ, రీడర్‌షిప్‌ సర్వే – తప్పుల తడక, జ్యోతిష్కుల మాట జవదాటని నాయకులు, బ్రిటన్‌లో సంక్షేమ పథకాల తీరు, బంగ్లాదేశ్‌ సంక్షోభం వెనక అమెరికా హస్తం, వీరప్ప మొయిలీ పోస్కో వివాదం, భగత్‌సింగ్‌తో పోలిక ఎలా కుదురుతుంది? రేపు టి-బిల్లుపై చర్చ జరిగేనా? మన రాష్ట్రం బర్త్‌ డే కేక్‌ కంటె అన్యాయం చిరంజీవి ఓవరాక్షన్‌ జీసస్‌ క్రైస్తు మతప్రవక్తా? తిరుగుబాటుదారుడా? నిజమే పాపం..పాకిస్తాన్‌లో కమ్యూనిస్టులున్నారా!? దిగంబర విషాదాంతం…,

…ఇటాలియన్‌ నావికుల వివాదం, రాజీవ్‌ హంతకులను వదలడం సబబేనా?, రెండు రాష్ట్రాల భవిష్యత్తు ఏమిటి? విశ్వకర్మలు కావాలి, వినైల్‌ వీరులు కాదు.., వెంకయ్యను చూస్తే జాలా? జుగుప్సా? నానావతి కమిషన్‌కు 21 వ సారి పొడిగింపు, టైపురైటర్లయితే సురక్షితమా? తప్పు ఒప్పుకుంటే తప్పా? కిరణ్‌ కీలుబొమ్మా? చిట్టగాంగ్‌ ఆయుధాల కేసులో 14 మందికి ఉరిశిక్ష. అమృతానందమయి – వివాదాలతో ఆలింగనం, పశ్చిమదేశాలకు, రష్యాకు మధ్య నలుగుతున్న ఉక్రెయిన్‌, సోనియా ఎలిజిబెత్‌ రాణియా?, కార్పోరేట్‌ గాడ్‌ఫాదర్‌- సహారా సుబ్రత రాయ్‌, జాట్‌లపై కాంగ్రెసు హఠాత్‌ అనుగ్రహం, దూరందే తప్ప దగ్గరది కనబడదు, పవన్‌కి ఛాన్సుందా?, తెలంగాణ పునర్నిర్మాణం ఎవరి చేతనవుతుంది?, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ జోషి రాజీనామా, పంజాబ్‌లో పరిశ్రమల మూసివేత, రాజ్‌ థాకరేతో బిజెపి దాగుడుమూతలు, గుజరాత్‌లోని మారుతి ఫ్యాక్టరీలో కార్లు తయారు కావు, బిజెపి తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?, బెయిల్‌ కావాలంటే పదివేల కోట్లు కట్టాలా? అమ్మో!, ఒకప్పటి బద్ధశత్రువులు యిప్పుడు భాగస్వాములు, నందన్‌కు ఆధార్‌ పనికి వచ్చేనా?. పోరాడి సాధించిన కొడుకు హోదా, కర్ణాటకలో డబ్బింగు వ్యతిరేక పోరాటం, మోదీ రథం కింద నలుగుతున్నారు

ఈ ఆర్టికల్స్‌లో సీరియల్స్ కలపలేదు. వాటిని విడిగా ఈ-బుక్స్‌గా తయారుచేద్దామని ప్లాను. అంటే బైబిల్, రాజీవ్ హత్య, తమిళ రాజకీయాలు, నిజాం కథలు, గోడ్సే, ప్రాణ్, హేమమాలిని, వినోద్ మెహతా.. యిలాటివన్న మాట. సాహిత్యాంశ వున్న కన్యాశుల్కం, మృచ్ఛకటికం, నచ్చిన కథ లాటి వాటితో యింకోటి చేయవచ్చు. ఆర్టికల్స్ ఫ్రీగా చదువుకోవచ్చు, అయితే వెతుక్కునే శ్రమ వుంటుంది. ఆ శ్రమ పడనక్కరలేకుండా చక్కగా ఫోటోలతో సహా పుస్తకాలుగా తయారుచేసి యిస్తాం కాబట్టి ఈ-బుక్స్‌ను కొనుక్కోవాలి. 1/8 డెమీ సైజులో ప్రియాంకా 15-15 ఫాంట్‌లో అచ్చు వేసిన పుస్తకాలు రూపాయికి పేజీ చొప్పున అమ్ముతున్నారు. ఈ-బుక్స్ కాబట్టి రూపాయికి 4 పేజీలిద్దామని ప్లాను. అంటే 200 పేజీల పుస్తకాన్ని 50 రూ.లు పెట్టి కొనాలన్నమాట. ఈ బుక్స్ కోసం యిదే బ్లాగ్‌లో వేరే ఆప్షన్ చూడండి. ఇది మీకు ఉపయోగకరంగా వుంటుందని ఆశ. ఇబ్బంది వుంటే తెలియపరచండి. – ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2021)

[email protected]