cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Interviews

అభిమానులను దృష్టిలో వుంచుకునే సినిమాలు

అభిమానులను దృష్టిలో వుంచుకునే సినిమాలు

రామ్ అంటే హై ఓల్టేజ్ కరెంట్ తీగ లాంటివాడే..దేవదాసుతో ప్రారంభించి, నేను శైలజ వరకు చకచకా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. తనకంటూ ఓ స్టయిల్, తనకంటూ ఓ మార్కెట్ తయారుచేసుకున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా, తనకు ఏ స్క్రిప్ట్ లు నప్పుతాయో చూసుకుంటూ, అవే చేసుకుంటూ ముందు వెళ్తున్న రామ్ తో ముఖాముఖి.

మళ్లీ మీ ట్రాక్ లోకి వచ్చేసినట్లున్నారు. నేను శైలజ మీకు పాత్ బ్రేకింగ్ కదా?

నిజమే. మీరన్నది. అది పాత్ బ్రేకింగ్ నే. కానీ నన్ను అభిమానులు ఎలా చూడాలను కుంటున్నారన్నది కూడా చూడాలి కదా? నా అభిమానులు ఇప్పుడు రెండు రకాలుగా వున్నారు. ఒకటి నేను శైలజ మాదిరిగా భిన్నమైన సినిమాలు చేయాలని అనుకునేవారు. నా స్టయిల్ సినిమాల్లో చూడాలనుకునేవారు. అందుకే ఇద్దర్నీ కలిపి ఆనందింప చేయగల సినిమాలు, లేదా రెండు రకాల సినిమాలు పారలల్ గా చేయాలనుకుంటున్నాను.

మీ అభిమానులు కోరుకునే తరహా సినిమాలు కొన్ని నిరాశ పర్చిన మాట ఇక్కడ మరిచిపోకూడదు కదా?

శివమ్ ఒక్కటే బాగా నిరాశపర్చింది. మిగిలినవి మరీ అంతగా కాదు. చాలా వరకు కమర్షియల్ గా పే చేసినవే. అలా అని అవే చేస్తా అనడం లేదు. నా స్టయిల్ కు నప్పే వైవిధ్యమైన స్క్రిప్ట్ లు ఏవి వచ్చినా ఓకె. 

హైపర్ ఎలాంటి స్క్రిప్ట్.?

మంచి స్క్రిప్ట్.. నా స్టయిల్ కు సరిపోతూ, చిన్న మెసేజ్ కూడా వుండే స్క్రిప్ట్. 

అంటే మీరు కూడా మెసేజ్ ఓరియెంటెడ్ వైపు మళ్లినట్లేనా?

నేను అంటే.. ఇప్పుడు మెసేజ్ లు ఎవరు ఇస్తున్నారండీ..అసలు.

శ్రీమంతడు, జనతాగ్యారేజ్.?

అలా అంటారా? పర్టిక్యులర్ గా అలా ఏమీ అనుకోలేదు. స్క్రిప్ట్ లో అలా సెట్ అయిందంతే.

ట్రయిలర్ లో ట్రయిల్ రూమ్ లో ట్రయిల్ వేసే డైలాగ్ బాగానే దూసుకెళ్లినట్లుంది?

అవునా..అబ్బాయి అమ్మాయి వెంట పడితే రొటీన్..అమ్మాయి అబ్బాయి వెంట పడితే బాగుంటుంది కదా?

రాశీ ఖన్నా పాత్ర ఎలా వుంటుందో ఆ ఒక్క డైలాగ్ తో చెప్పేసినట్లున్నారు.?

కానీ ఇంకో పాయింట్ ఏమిటంటే, ఆమె పాత్రకు రెండు షేడ్స్ వుంటాయి. రెండో షేడ్ సినిమాలో చూస్తారు.

అనిల్ రావిపూడితో గుడ్డివాడి క్యారెక్టర్ ప్రయోగం చేద్దామనుకున్నారేమో? ఏమయింది?

అది ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఇంకా డిస్కషన్ స్టేజ్ లోనే వుంది.

ఫ్లాప్ సినిమాల తరువాత సంతోష్ శ్రీనివాస్, కరుణాకరణ్ కు ఎలా చాన్స్ లు ఇవ్వాలనిపించింది.?

సినిమా ఫ్లాప్ కావడానికి చాలా రీజన్లు వుంటాయి. డైరక్టర్ గా ఫెయిలయితే ఆలోంచించాలి. అలా కానపుడు, వాళ్లు మంచి డైరక్టర్లు అని మనకు తెలిసినపుడు, మంచి స్క్రిప్ట్ వుందన్నపుడు మనం ఎందుకు వెనక్కు తగ్గాలి. కందిరీగ మంచి సినిమా. డైరక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ఎందుకంటే ప్రేమంట కూడా మరీ బ్యాడ్ మూవీ ఏమీ కాదు. ఇప్పటికీ టీవీల్లో మంచి టీఆర్పీ వుంది దానికి.

తరువాతి సినిమా కరుణాకరణ్ తో ఫిక్సయినట్లేనా?

కొంతవరకు. ఇంకా చాలా ప్రపోజల్స్ డిస్కషన్ లో వున్నాయి.

ఎక్కువగా స్వంత బ్యానర్ కే పరిమితం అవుతున్నట్లున్నారు?

అలా అని ఏమీ లేదు. కాస్త కంఫర్ట్ గా వుంటుందని. ప్రాజెక్టు సెట్ అయితే ఏ బ్యానర్ అయినా ఓకె. 

మీ సినిమాల విషయంలో మీరు బాగా జోక్యం చేసుకుంటారని టాక్?

ఎవరో ఏదో అనుకుంటారు..సినిమా హిట్ అయితే మంచి ఇన్ పుట్స్ ఇచ్చారు అంటారు. ఫ్లాప్ అయితే కెలికేసాడు అంటారు. నా మటుకు నాకు మరో ప్రపంచం లేదు. సినిమానే అన్నీ. ఏ సినిమా చేస్తుంటే ఆ సినిమా జనాలతోనే ఇంటరాక్ట్ అవుతాను. అదే డిస్కస్ చేస్తాను. దానికి ఏవో అనుకుంటే ఎలా?

సినిమా మేకింగ్ మీద అంత ఇంట్రస్ట్ వున్నపుడు ఓ సినిమా డైరక్ట్ చేయచ్చుగా ఎప్పటికైనా?

అమ్మో..అది మనవల్ల కాదు. చాలా పెద్ద పని.

హైపర్ మీద మీ హోమ్ ఏ మేరకు..?

చాలా..మంచి స్క్రిప్ట్, మంచి కాంబినేషన్..మంచి కో స్టార్స్..అందుకే చాలా.

ఓకె. బెస్టాఫ్ లక్

థాంక్యూ

విఎస్ఎన్ మూర్తి