Advertisement


Home > Movies - Interviews
సినిమా నిర్మాణం నా అభిరుచి

ఇంజినీర్ గా ఉద్యోగం. ఆపై మేనేజ్ మెంట్ వైపు మళ్లీ కోట్లలో వ్యాపారాలు..ఫుల్ బిజీ..కానీ సినిమాల టెన్షన్ నెత్తికి ఎత్తుకోవడం అంటే, ఇంకా అక్కడ కూడా సంపాదంచాలనే అనుకుంటారంతా..కానీ బెంగాల్ టైగర్ నిర్మాత రాధామోహన్ వ్యవహారం వేరు. ఆయనకు సినిమా అంటే సరదా..ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, కల్చరల్ ఏక్టివిటీస్ అన్నా, స్పిరుట్యువల్. కమ్యూనిటీ ఏక్టివిటీస్ అన్నా ఇష్టం. అందుకే  ఉగాండా, కెన్యా లాంటి విదేశాల్లో బాలాజీ ఆలయాల నిర్మాణంలో పాలు పంచుకున్నారు. ఏటా విదేశాల్లో తెలుగువాళ్ల సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తుంటారు. క్షణం తీరిక లేని వ్యవహారాలు చేతినిండా పెట్టుకుని..ఎందుకీ సినిమా తలనొప్పి అని అడిగితే నిర్మాత రాధామోహన్ చెప్పే సమాధానం ఇదే. 

'..రిటైర్ అయ్యాక ఏం చేస్తారు..అని అడిగితే ..నేను..చాలా మంది అడిగితే చెప్పా..సినిమాలు తీస్తా అని. అంత ఇష్టం నాకు. సినిమా రంగం అంటే. అయితే రిటైర్ అయ్యే వరకు ఆగలేదు..మధ్యలోనే మొదలెట్టా..అయితే వస్తూనే భారీ సినిమాలు తీయచ్చు..సమస్య కాదు. కానీ అసలు ఈ రంగం ఆనుపానులు నాకు తెలియాలిగా..అందుకే చిన్న సినిమాలు నాలుగైదు చేసి, ఇక్కడ ప్లానింగ్..నాన్ ప్లానింగ్ వ్యవహారాలు గమనించి, అప్పుడు పెద్ద సినిమా చేసా. మొట్టమొదట వస్తూనే ఫుల్ డిజిటల్ సినిమా చేస్తే, అందరూ వింతగా చూసారు. ఇప్పుడు అంతా డిజిటల్ మయం అయింపోయింది...'

'..నిజానికి నేను చాలా డిసిప్లిన్డ్ రంగం నుంచి వచ్చాను. సినిమా అంటే ఏదీ ఓ పద్దతిగా వుండదు అంటారు. కానీ నా వరకు నా ప్రొడక్షన్ మాత్రం పక్కా ప్లానింగ్ గా వుండేలా చూసుకుంటాను. ఎక్కడా ఒక్క పైసా పేమంట్ కూడా తేడా రాకుండా చూస్తాను. రేపటి పని ఇవ్వాళే షెడ్యూల్ చేస్తాను. ఇలా వీలయినంతగా ఇక్కడ కూడా కార్పోరేట్ సెక్టార్ మాదిరిగా ఓ పద్దతిగా వుండేలా చూసుకున్నాను...'

'..పెద్ద సినిమా చిన్న సినిమా అని కాదు..నాకు కీలకం..మంచి సినిమా.ముందు సబ్జెక్ట్ ఓకె అయితే, అప్పుడు స్టార్ కాస్ట్..బెంగాల్ టైగర్ విషయమే తీసుకోండి..బోమన్ ఇరానీ గారికి ఇరవై నిమషాలు బ్రీఫింగ్ ఇవ్వగానే, యూనివర్సల్ సబ్జెక్ట్..నేను చేస్తున్నా అనేసారు..'

బెంగాల్ టైగర్ ఫుల్ అండ్ ఫైనల్ ప్రొడక్ట్ చూసాను..రవితేజ, తమన్నా, రాశీ ఖన్నా, బ్రహ్మీ, పృధ్వీ, పోసాని..అంతా చాలా పక్కాగా సెట్ అయ్యారు. చాలా బాగా వచ్చింది. ఆపై ప్రేక్షకుల అభిరుచి బట్టి వుంటుంది. వాళ్లకు కూడా నచ్చుతుందనే పూర్తి నమ్మకం వుంది.

'..నేను స్పిరిట్యువల్ నా..డివోషనల్ నా..అని కాదు..నేనేమీ రోజూ పూజలు అవీ చేయను కానీ, దేవుడ్ని నమ్ముతాను. ఆయన దయ వుండాలి. ఆ నమ్మకంతోనే విదేశాల్లో రెండు బాలాజీ ఆలయాల నిర్మాణంలో పాలు పంచుకున్నాను.  మన పని మనం చేసుకుంటూ వెళ్లాలి. ఏం జరిగినా స్వీకరించడానికి మానసికంగా సిద్ధంగా వుండాలి. అదే నా పాలసీ. దీన్ని స్పిరుట్యువల్ అంటారో, డివోషనల్ అంటారో, ఫిలాసఫీ అంటారో నాకు తెలియదు..'

'..తరువాతి ప్రాజెక్టు అంటారా..ఈ సినిమా విడుదల కావాలి. జనం దాన్ని ఆదరించాలి. ఆ తరువాత మళ్లీ మంచి సబ్జెక్ట్ కుదరాలి..అప్పుడు...ఆ రోజు వుంటుందనే నమ్ముతున్నాను..'