Advertisement

Advertisement


Home > Movies - Interviews

గరమ్ గరమ్ చాయ్...గరం....ఆది

గరమ్ గరమ్ చాయ్...గరం....ఆది

'ప్రేమ కావాలి' అంటూ సర్రున దూసుకు వచ్చాడు టాలీవుడ్ లోకి ఆది..కేరాఫ్ సాయికుమార్. ఫస్ఠ్ సినిమానే హండ్రడ్ డేస్ పక్కా.. అది కేరాఫ్ సాయికుమార్ అన్న ట్యాగ్ లైన్ తొలి సినిమా వరకే. మలి సినిమా లవ్ లీతో, ఆది ఎవరో ప్రేక్షకులకు పరిచయమైపోయింది. ఆ సినిమా కూడా సూపర్ హిట్..సర్రున దూసుకెళ్లాడు. కానీ ఎక్కడో చిన్న రోడ్ బ్లాక్..ఇప్పుడు ఆ రోడ్ బ్లాక్ ను అధిగమించి, ఓ బ్లాక్ బస్టర్ ఎలా కొట్టాలా అని చూస్తున్నాడు. గరం అంటూ ఈవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సందర్భంగా చిన్న చిట్ చాట్ ఆదితో..

ప్రేమ అన్నారు..లవ్ లీ గా కనిపిస్తూ..ఇప్పుడేంటీ..గరం అంటున్నారు.?

గరమ్ గరమ్ చాయ్ లాంటి సినిమా..యూత్..పెద్దవాళ్లు..ఫ్యామిలీలు ఇష్టపడతారుగా గరమ్ చాయ్ ని..

అంటే అందరికీ నచ్చే సినిమా అంటారు.?

యా...డైరక్టర్ మదన్ అంటే..అలాంటి సినిమాలే అందించారు..ఆ నలుగురు..పెళ్లయిన కొత్తలో..ఇది కూడా ఆయన స్టయిల్ లో వుండే, నాలాంటి నటుడికి నప్పే సినిమా.

అసలు..లవ్ లీ గా వుండే మీరు..సిక్స్ ప్యాక్ వీరుడిగా ఎందుకు మారారు..అది మీ ఫేస్ మీద కాస్త ఫ్రభావం చూపినట్లుందిగా?

ఏం చేస్తాం..అందరూ చేస్తున్నారు..మనం చేసేద్దాం అనుకుంటాం..కుర్రాళ్లం కదా..ట్రయ్ చేసాను..తెలిసివచ్చింది.

అంటే ఈసారి మీ లవబుల్ రొమాంటిక్ ఇమేజ్ లోనే ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారా?

ఫలానా ఇమేజ్ అని కాదు. నాకు నప్పేవి..నన్ను ప్రేక్షకులు చూడగలిగేవి.. చూడాలనుకునేవి..ఇలాంటి పాత్రలు ఎంచుకుంటూ ముందుకు వెళ్లాలనుకుంటున్నా.

అసలు ఒకటి రెండు సినిమాలు చేయగానే యంగ్ హీరోలు మాస్ ఇమేజ్ కోసం ఎందుకు ట్రయ్ చేస్తారు?

ఇక్కడ మాస్ ఇమేజ్ కోసం అని కాదు. మాస్ కోసం. ఎందుకంటే మాస్ ఎక్కువగా సినిమాలు చూస్తారు..ఎవరైనా సరే, ఏ కళలో అయినా సరే, ఎక్కువ మందికి చేరువ కావాలని అనుకుంటారు. అందుకే మాస్ జనాలకు నచ్చే సినిమా చేస్తే, ఎక్కువ మంది చూస్తారనే ఆశ. అంతకు మించి అందులో ఏదో వుంది అని మాత్రం కాదు. నా వరకు అదే నా ఒపీనియన్.

సుకుమారుడు..గాలిపటం..రిజల్ట్స్ నిరాశ పరిచాయా..?

నిరాశ సహజమేగా..ఆడకపోతే. అయితే గాలి పటం సినిమాకు మంచి ప్రశంసలే వచ్చాయి. కొత్త ప్రయత్నం అని, బాగా చేసారు అని.

కమింగ్ బ్యాక్ టు గరమ్..ఎలా వుండబోతోందీ సినిమా.?

చాలా బాగుంటుంది. ప్రేక్షకులు కోరుకునేవి అన్నీ వుంటాయి ఇందులో. నిజానికి గరం టైటిల్ చూసి ఏదో అనుకోవచ్చు..క్యాచీగా వుంటుందనే తప్ప వేరు కాదు. మంచి ఫీల్ వుండే సీన్లు, పాటలు, ఫైట్లు ఇలా ప్రతి ఒక్కరికి నచ్చేవీ వున్నాయి.

స్వంత సినిమా కదా ఇది..ఎర్లీ డేస్ లోనే స్వంత సినిమాకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది.?

మంచి సబ్జెక్ట్..అనుకోకుండా ఆగింది. దాంతో టేకప్ చేయక తప్పలేదు. థాంక్స్ టు డాడీ..మమ్మీ.

మీ శ్రీమతి ఏమంటారు మీ సినిమాల గురించి.?

తను ఫస్ట్ అండ్ బెస్ట్ క్రిటిక్. ఓపెన్ గా చెబుతుంది..తనకి లవ్ లీ సినిమా చాలా ఇష్టం.

మీ ఫేస్ లో కాస్త ఫ్యాట్ చేరితే బాగుందని కానీ, ఇలాగే బాగుంటదని కానీ ఎప్పుడూ అనలేదా?

నిజానికి ఫేస్ లో కాస్త ఫ్యాట్ వుంటే మా మేకప్ మేన్ ఒప్పుకోడు. మీ ఫేస్ ఇలాగే బాగుంటుంది అంటాడు. 

చుట్టాలబ్బయి కదా తరువాతి సినిమా..?

అవును, వీరభద్రమ్ గారితో అవుట్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ సినిమా అది. 

గరం తరువాత ప్రొడక్షన్ కంటిన్యూ చేస్తారా?

అది ఇప్పుడే చెప్పలేను. నిజానికి ఇప్పట్లో మాకు కష్టమే. ఎందుకంటే డాడీ ఫుల్ బిజీ. ఆయన సినిమాలతో. నాకు సినిమాలు వున్నాయి. అందువల్ల మరీ అవసరమై, మంచి సబ్జెక్ట్..ఇది మనమే చేయాలి అనుకుంటే తప్ప..

సో..గరం మీద చాలా హోప్స్ పెట్టకున్నట్లున్నారు.

గరం మీద అనే కాదు..చేసే ప్రతి సినిమా మీదా కూడా. ఇది ఓన్ ప్రొడక్షన్ కదా..అందుకే మరింత కేర్ తీసుకుంటున్నాం పబ్లిసిటీ విషయంలో.

ఓకె. బెస్టాఫ్ లక్ ఆదీ..

థాంక్యూ

విఎస్ఎన్ మూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?