Advertisement


Home > Movies - Interviews
కొత్తదనం ఎంతవరకో అంతవరకే వుండాలి - శ్రీవాస్

శ్రీవాస్..ఖాతాలో రెండు హిట్ లు వుండి కూడా లో ప్రొఫైల్ లో వుండే దర్శకుడు. లౌక్యం హిట్ కొట్టేసి, ఏకంగా బాలకృష్ణనే డైరక్ట్ చేసే చాన్స్ కొట్టేసాడు. బాలకృష్ణతో సినిమా అంటే సింహం మీద స్వారీనే. ఫ్యాన్స్ ను మెప్పించాలా..కొత్తగా చూపించాలా..కొత్తగా చెప్పాలా...ఇంకేదైనా చేయిలా.. ఫైనల్ గా బాలయ్యకు సూట్ అవ్వాలి...ఇన్ని డైలమాలు. ఈ ఫీట్ ను పూర్తి చేసాడు ఇటీవలే డిక్టేటర్ తో. అందరూ సినిమాకు ముందు మాట్లాడితే..శ్రీవాస్..తరువాత మాట్లాడారు..ఆ వివరాలు ఇవి.

కాన్ఫిడెన్స్ తొనే

మిగతావాళ్ల సంగతి నాకు తెలియదు..నేను సినిమా విడుదలకు ముందు కన్నా వెనుక మాట్లాడడానికి ఒకటే కారణం..సినిమా హిట్ కొడుతుందనే నమ్మకం. హిట్ కొట్టాక మనం ఏం చెప్పినా బాగుంటుంది..అంతే కానీ, ముందే..ఇంత సూపర్..అంత సూపర్ అని చెప్పడం ఎందుకునే మాట్లాడలేదు.

కాన్పిడెన్స్ వచ్చింది

బాలయ్య లాంటి హీరోతోనే కాదు, అసలు ఓ భారీ సినిమా తీయాలంటేనే ఎంత కష్టమో అందరికీ తెలుసు.  సినిమా నిర్మాణం అంటే చివరి నిమిషం వరకు టెన్షన్ టెన్షన్. అలాగే భారీ సినిమాకు దర్శకత్వం అంటే అంతకన్నా టెన్షన్. సరైన నిర్మాత వుంటే, ఆయన టెన్షన్లు ఆయన పడితే, డైరక్టర్ టెన్షన్ డైరక్టర్ పడతాడు. కానీ డిక్టేటర్ విషయంలో రెండూ నేనే...ఓ పక్క ఫైనల్ సెటిల్ మెంట్లు..మరోపక్క..సినిమాకు తుది మెరుగులు..ఆఖరికి ఓ సంతృప్తి...రెండు కీలకమైన టాస్క్ లు సక్సెస్ ఫుల్ గా చేయగలిగాను అని. అంతే కాదు..పెద్ద సినిమా అంటే విడుదల లాస్ట్ మినిట్ వరకు అనుమానమే. కానీ ముందే డేట్ చెప్పి, ఏ మాత్రం డౌట్ లేకుండా విడుదల చేసా.

కొత్తదనం కొంతవరకే

బాలయ్య బాబును గతంలో పవర్ ఫుల్ గా చూపించడానికి కాస్త ఏజ్డ్ గా చూపించారు. రఫ్ లుక్ ఇచ్చారు. అందుకే ఈసారి నేను యంగ్ గా, స్టయిలిష్ గా చూపిస్తూ పవర్ ఫుల్ గా చూపాలనుకున్నాను. ఆ లుక్ కు మంచి అప్లాజ్ వచ్చింది. పాటలు, సీన్స్ లో బాలకృష్ణ చాలా బాగున్నారన్న కామెంట్ వచ్చింది..అభిమానులైతే ఇక ఫిదా అయిపోయారు. అయితే సినిమా కథలో కొత్తదనం లేదన్న విమర్శ నా దృష్టికి రాకపోలేదు. వంద సినిమాలకు దగ్గర చేసిన హీరోకి కొత్త కథ రావడం అంత సులువు కాదు. బాలకృష్ణ కొన్ని తరహా కథలు చేస్తారు..కొంతమంది కొన్ని తరహా కథలనే చూస్తారు. బాలయ్య అభిమానులు కొన్ని తరహా కథల్లోనే బాలయ్యను చూడాలనుకుంటారు. ఈ మూడు ఈక్వేషన్లలో నేను ఏ దారిన వెళ్లాలి..కొత్తగా ట్రయ్ చేసి బాలయ్య బాబు అభిమానులను దూరం చేసుకోవాలా? అప్పుడు విభిన్న కథలను మెచ్చుకునేవారు కచ్చితంగా వస్తారని గ్యారంటీ వుందా?  ఇలా రకరకాల సందేహాలు. ఆఖరికి ఉన్నంతలో కొత్తదనం చూపాలనుకున్నాను. అందుకే లేడీ విలన్ క్యారెక్టర్ తీసుకువచ్చాం. కార్పొరేట్, మాఫియా నేపథ్యం తీసుకున్నాం. నా దృష్టిలో బాలకృష్ణ లాంటి పాపులర్ మాస్ హీరో విషయంలో అనవసరపు ప్రయోగాలు చేయకూడదు. అభిమానులను, ఆయన ఇమేజ్ ను దృష్టిలో వుంచుకుని ముందుకు వెళ్లాలి.

ఫలితం సంతృప్తికరం

డిక్టేటర్ ఫలితం నాకు నూటికి నూరు పాళ్లు సంతృప్తి కలిగించింది. నేను సినిమా ఇచ్చిన బయ్యర్లు అంతా సేఫ్ అయ్యారు. సినిమా చరిత్రలోనే ఓసారి అమ్మేసిన తరువాత బయ్యర్ల సమస్యను, థియేటర్ల సమస్య,  దృష్టిలో వుంచుకుని, రేట్లు తగ్గించాం. అయినా కూడా నిర్మాతగా నేను హ్యాపీ. పండగకు టేబుల్ ప్రాఫిట్ తో విడుదలైన సినిమా మాది. పండుగ తరవాత బయ్యర్లు గట్టెక్కేసిన మొదటి సినిమా మాది.

నిర్మాతగా..దర్శకుడిగా

ఇకపై కూడా నిర్మాతగా కొనసాగుతానా లేదా అన్నది ప్రాజెక్టును బట్టి వుంటుంది. మంచి ప్రాజెక్టు అయితే కచ్చితంగా నిర్మాతగా వ్యవహరిస్తా..అలా అని పెద్ద సినిమాలే కాదు..చిన్న సినిమాలు కూడా అందించాలని వుంది. అయితే నిర్మాతగా వుంటేనే దర్శకత్వం చేస్తానని కాదు..దాని దారి దానిదే. నిర్మాత దొరికితే దర్శకుడిగా నా  పనినేను చేసుకుంటా.

వినోదమే ప్రధానం

నా మటుకు..ప్రేక్షకులకు నూటికి నూరు పాళ్లు వినోదం అందించడమే ప్రధానం. ఎన్టీఆర్..కాలం నుంచీ నేటి వరకు ఏ హీరోకైనా అల్టిమేట్ గోల్ అదే కదా. ఆ రోజు రూపాయి, రెండు పెట్టి చూసారు..ఇప్పడు వంద రెండు వందలు పెట్టి చూస్తున్నారు..రెండున్నర గంటల వినోదం కోసమే కదా..అందుకే దానికే నా ఫస్ట్ ప్రయారిటీ.

అది చాలు నాకు

డిక్టేటర్ సినిమా ఏమేరకు లాభాలు ఇచ్చింది అన్నది కీలకం కాదు నాకు..బాలకృష్ణ అభిమానుల నుంచి అందుతున్న ప్రశంసలు కీలకం.అన్నా..అన్నా..అంటూ వాళ్లు చేస్తున్న ఫోన్ లు, వ్యక్తిగతంగా కలిసి మరీ అభినందిస్తుంటే..ఆ ఆనందం మాటల్లో చెప్పలేను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా ఫోన్ చేసి..అభినందించారు..అంతకన్నా ఏం కావాలి.

విఎస్ఎన్ మూర్తి