cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Interviews

నాది స్లో అండ్ స్టడీ ప్రాసెస్

నాది స్లో అండ్ స్టడీ ప్రాసెస్

సమ్మోహనం సినిమా సుధీర్ బాబుకు 12వ సినిమా కావచ్చు. కానీ మంచి సబ్జెక్ట్, డైరక్టర్ దొరికితే ఎలా ప్రూవ్ చేసుకోగలడు సుధీర్ బాబు అన్నది తెలియచెప్పిన సినిమా. పెర్ ఫార్మెన్స్ పరంగా సుధీర్ బాబుకు రిమార్కులేదు. ప్రేమకథాచిత్రమ్ నుంచి భలేమంచిరోజు, శమంతకమణి మీదుగా సమ్మోహనం వరకు. సినిమా సినిమాకు ప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నాడు. కానీ ఇంకా.. మరింత.. మరి కొంచెం ఎక్కువ అనే టార్గెట్ ఎదుట వుండనే వుంటోంది. ఈ నేపథ్యంలో తొలిసారి నిర్మాతగా మారి 'నన్ను దోచుకుందువటే' అనే సినిమా అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సుధీర్ బాబు మనసులో మాటలు

ఇక్కడ సరే, బాలీవుడ్ లో పెద్ద ప్రొడక్షన్ హవుస్, కీలకమైన విలన్ పాత్రకు నన్ను ఏరికోరి తీసుకున్నపుడు, జనాలకు కాస్త అర్థం అయింది. సుధీర్ బాబు కూడా నటుడే. ఏదో అలా అలా వచ్చేయలేదు అని. అందుకే అలా మెల్లగా ఒకటీ ఒకటీ చేసుకుంటూ వస్తున్నా. ఒక్కో మెట్టు ఎక్కుతా. తొందరేమీ లేదు. నాకు నప్పే పాత్రలే చేసుకుంటూ ముందుకు వెళ్తా. మాస్ పాత్ర ఒక్కసారి ట్రయ్ చేసాను, కానీ అది టైమ్ కాదు అని తెలిసింది. వదిలేసా.

కాస్త త్వరగా నిర్మాతగా మారినట్లున్నారు?
త్వరగా అని కాదు. నేను మొదటి నుంచి ఇండిపెండెంట్ గా ఎదగాలనే చూస్తున్నాను. కొన్నిసార్లు అనిపించింది. మనం నిర్మాత అయితే ఆ సబ్జెక్ట్ టేకప్ చేసేవాళ్లం కదా? మనమే నిర్మాత అయితే ఆ సినిమా చేసే వాళ్లం కదా? అని. ఆ ప్రాసెస్ లో అలా ఈ ప్రాజెక్టు మొదలైంది. మంచి సబ్జెక్ట్, కొత్త డైరక్టర్, చేస్తే బాగుంటుంది అనిపించింది చేసేసాను.

సో, తొలిసారి నిర్మాతల కష్టాలు లేదా అనుభవాలు తెలిసివచ్చాయా?
నేను చేసినవి అన్నీ కాస్త చిన్న మీడియం బ్యానర్లే, ఎక్కువ మంది కొత్త, మీడియం డైరక్టర్లే. అందువల్ల వాటన్నింటికి కూడా నేను ప్రొడక్షన్ ఎలా వస్తోంది? ప్రమోషన్ ఎలా జరుగుతోంది? అన్నవి కేర్ తీసుకునేవాడిని. ఇప్పడు కూడా అదే చేసాను. అందువల్ల కొత్తగా అనిపించలేదు.

సినిమా తీయడం సులువు, థియేటర్లలోకి పంపడం కష్టం అంటారు?
నిజమే. కానీ నా అదృష్టం కొద్దీ ఇండస్ట్రీలో స్నేహితులు, పరిచయాలు, సురేష్ బాబు, యువి వంశీ, గీతా ఇలా అందరూ సాయం చేసారు. సో, ఈజీ అయింది.

కృష్ణ గారి పద్మాలయ, ఇంకా చాలా బ్యానర్లు మీ ఫ్యామిలీలో వున్నాయి. ఇప్పుడు మీరు కూడా.
బ్యానర్ అన్నది తరతరాలకు నిలిచిపోయేది. నేను హీరోగా వుండొచ్చు, వుండకపోవచ్చు. కానీ బ్యానర్ వుంటుంది. నా పిల్లలకు వాళ్ల పిల్లలకు కూడా. అందుకే ప్రత్యేకంగా స్టార్ట్ చేసా. ఇక పద్మాలయా, ఇందిరా ప్రొడక్షన్స్, కృష్ణ ప్రొడక్షన్స్, ఎంబి, ఇలా అన్నీ వున్నాయి. ఇదీ ఒకటి.

ఈ సబ్జెక్ట్ లో ఏం నచ్చింది? మీరు చేయని పాత్ర అనా? దేనికి టేకప్ చేసారు?
ఇది లవ్ స్టోరీనే. సండే కూడా పని.. పని అంటూ, తన కింద పనిచేసే వారిని ఇబ్బంది పెట్టే బిగ్ బాస్ లాంటి కుర్రాడు ప్రేమలో పడితే ఎలా వుంటుంది? ఆ థాట్ నచ్చింది. ఆ క్యారెక్టర్ నచ్చింది.

ఈ సినిమా హీరోయిన్ నభా నటేష్ కు మంచి పేరు తెస్తుందని వినిపిస్తోంది?
కచ్చితంగా అండీ. ఆ పాత్రకు మాంచి వెయిట్ వుంది స్క్రిప్ట్ లో. అందుకే ఎవరు? ఎవరు? అని చాలా వెదుకులాడి, ఆఖరికి నభాను ఫిక్స్ చేసాం. ఆ అమ్మాయి కూడా ఆ మేరకు బాగా చేసింది.

సుధీర్ బాబు మంచి నటుడే.. కానీ ఇంకా సరిపడా మార్కెట్ రాలేదు అన్న కామెంట్లు మీ దాకా వచ్చాయా?
నేను ఒకటి క్లారిటీగా చెప్తానండీ. నేనైతే ఓవర్ నైట్ టాప్ హీరో అయిపోవాలని ఇక్కడికి రాలేదు. అసలు రావడంతోనే నాకు ఓ సమస్య వుంది. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. అందుకే హీరో అయిపోయాడు అనేసారు సులువుగా. అసలు ఆ కామెంట్ల నుంచి బయటపడి నా అంతట నేను స్వంతంగా ఎదిగి చూపించాలని ప్రయత్నిస్తూ వస్తున్నాను. దానికే చాలా టైమ్ పట్టింది.

తెలుగు హీరోలు ప్రయోగాలకు రెడీగా వున్నారు. చేస్తున్నారు. మీరు కూడా విలన్ గా చేసారు. తెలుగులో కూడా అలా ఏమన్నా?
తెలుగులో నాకు హీరో అవకాశాలు బాగానే వస్తున్నాయి. అందువల్ల విలన్ గా చేయడం సరికాదు. ఇక హీరోగా డిఫరెంట్ రోల్ అంటారా? ఎవరు ఆఫర్ చేసినా రెడీ. నేను ముందు నటుడిగా ప్రూవ్ చేసుకొవాలి. ఆపై హీరోగా ప్రూవ్ చేసుకోవాలి.

ఇక నా మార్కెటింగ్ అంటారా? కేవలం థియేటర్ వర్త్ చూసి అలా ఫిక్స్ అయితే ఏమీ చేయలేం. అదీకాక చాలా ఫ్యాక్టర్లు వుంటాయి. బ్యానర్, కాంబినేషన్ రిలీజ్ టైమ్. ఇవన్నీ చూడాలి. ఇంకా డిజిటల్ ప్లాట్ ఫారమ్ లు, ఆ ఇన్ కమ్ కూడా లెక్కలోకి తీసుకోవాలి.

మీతో బయట నిర్మాతలు సాహసించని భారీ సినిమాలు స్వంత బ్యానర్ పై  తీసే ఆలోచన వుందా?
ఎవరో తీయని సినిమాలు తీయాలని కాదు. నా దృష్టికి వచ్చిన మంచి సబ్జెక్ట్ లు, మంచి డైరక్టర్లు, నాకు సరిపోయేవి, వేయబుల్ అనుకునేవి తీయడానికి మాత్రమే ఈ బ్యానర్. ఏడాదికి రెండు సినిమాలు చేయాలన్నది నా ఆలోచన. వాటిలో ఒకటి బయట బ్యానర్ కు, ఒకటి స్వంత బ్యానర్ కు. అలా అన్నమాట.

అంతేకానీ, మనం బ్యానర్ పెట్టాం, భారీగా తీసేద్దాం అని మాత్రంకాదు. చెప్పాగా, నేను మెట్టు మెట్టు ఎదగాలనుకుంటున్నాను. ఓవర్ నైట్ కొండ ఎక్కేయాలమని అనుకోవడం లేదు.

ఓకె.. ఆల్ ది బెస్ట్

థాంక్యూ

 


×