Advertisement

Advertisement


Home > Movies - Interviews

ఓ మంచి ప్రయత్నం చేసాం

ఓ మంచి ప్రయత్నం చేసాం

టాలీవుడ్ లో అన్ని బ్యానర్లు ఒకటి కావు..అందరు నిర్మాతలకు ఓ స్టేటస్ అంటూ రాదు. అలా మంచి బ్యానర్ అనిపించుకుని, మంచి స్టేటస్ తెచ్చుకున్న నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ..ఇలా అనే కన్నా చినబాబు అంటే చాలా మందికి తెలుస్తుంది. కుర్రాళ్లను ముందున వుంచి, తాను వెనుక నుంచి పర్యవేక్షణ చేస్తూ, మంచి సినిమాలు అందించాలని ప్రయత్నిస్తూ వస్తున్నారు. జులాయి..సన్నాఫ్ సత్యమూర్తి లాంటి కమర్షియల్ హిట్ లు ఆయన ఖాతాలో వున్నాయి. ఇప్పుడు ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అందించే యత్నంలో భాగంగా 'అ..ఆ' సినిమాను నిర్మించారు. హారిక హాసిని అంటే రాధాకృష్ణే కాదు..దర్శకుడు త్రివిక్రమ్ కూడా టక్కున గుర్తుకు వస్తారు. ఈ సినిమాకు కూడా త్రివిక్రమ్ శ్రీనివాసే దర్శకుడు. మాస్ సినిమాలను పక్కన పెట్టి, ఓ ఫక్తు ఫ్యామిలీ ప్లస్ లవ్ సబ్జెక్ట్ తో అ..ఆ సినిమాను రూపొంందించారు. ఈ సందర్భంగా రాధృకృష్ణ తో చిన్న చిట్ చాట్.

అ..ఆ... అంటే నిర్మాతగా ఓ సినిమా అనే అంటారా? అంతకు మించి ఏమన్నా వుందా?

వుందనే చెప్పాలి. ఇంతకు ముందు మేం నిర్మించినవి త్రివిక్రమ్ స్టయిల్ కమర్షియల్ సినిమాలు. ఇది అదే త్రివిక్రమ్ మనసు పెట్టి చేసిన, తెరపై భావుకత చూపించిన ఓ వైవిధ్యమైన ప్రయత్నం.

పెద్ద సినిమాలు చేస్తూ, అ..ఆ అనే చిన్న సినిమా స్టార్ట్ చేసారు? ఎందుకని?

అన్ని నిబంధనలు, సినిమా రాజ్యాంగం పక్కన పెట్టి ఓ మంచి సినిమా చేద్దామని దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. నాకు నచ్చింది ఆ అయిడియా..అందుకే ఓకె అన్నాను. ఇక ప్రకటించినపుడు ఇది చిన్న సినిమాయేమో? కానీ ఇది ఇప్పుడ పెద్ద సినిమానే. త్రివిక్రమ్ స్థాయి దర్శకుడు..ఇంత స్టార్ కాస్ట్..టాప్ టెక్నీషియన్లు..మరి ఇక పెద్ద సినిమానే కదా?

ఎలా వచ్చింది సినిమా..పూర్తిగా చూసారా?

నేను సాధారణంగా నా సినిమాల అక్కడ కొంత ఇక్కడ కొంత, అలా ముక్క ముక్కలుగా చూడడం అవుతూ వుంటుంది. కానీ చిత్రంగా ఈ సినిమా పూర్తిగా చూసాను. నా సినిమా నాకు ఎలాగూ నచ్చుతుంది..మీ అందరికీ నచ్చాలి..ప్రేక్షకులకు నచ్చాలి.

నితిన్ లాంటి హీరో మీద ఇంత బడ్జెట్?

ఇక్కడ హీరో ఎవరు అన్నది కాదు..మంచి సినిమాకు ఏం కావాలి అన్నదే ఆలోచించాం..మంచి సినిమాకు అన్నీ ఉన్నతంగానే వుండాలనుకున్నాం..ఆ విధంగా బడ్జెట్ పెరిగి వుండొచ్చు.

మరి మీకు ప్రాజెక్టు లాభదాయకం కావాలి కదా?

ప్రాజెక్టు నాకు లాభం అవుతుందా కాదా అన్నది ఎప్పుడూ నేను ఆలోచించను. అలా అని నాకు డబ్బులు ఎక్కువ వున్నాయి అన్నది కాదు. బయ్యర్లు సేఫ్ అవ్వాలి. నా సినిమా కొనుక్కున్న వారు నష్టపోకుండా వుంటే చాలు. అదే ఆలోచిస్తాను.

మీ ఇంతకు ముందు సినిమాల అడియోతో పోలిస్తే ఈ అడియో ఎలా వుంది?

అవి మాస్ సినిమాలు..మాస్ అడియో..ఇది డిఫరెంట్ అటెంప్ట్..దీనికి తగిన అడియో ఇది. విన్నవాళ్లంతా బాగున్నాయనే అంటున్నారు.

ఇంతకీ మీ అ..ఆ..క్లాస్ నా..మాస్ నా?

సినిమా ప్రథమార్థం అంతా మాస్ గానే వుంటుంది. అంటే సరదాగా, హాయిగా వుంటుంది. ద్వితీయార్థంలో కథ వుంటుంది. ఫీల్ గుడ్ గా. ముగింపు సన్నివేశాలు బాగా గుండెలకు తాకుతాయి. సెన్సారు వాళ్లు అదే అన్నారు. మంచి ఫీల్ వుండే సినిమా తీసారు అని. తెలుగు ప్రేక్షకుల అభిరుచి కూడా మారుతోంది. సినిమా బాగుంటే తప్పకుండా థియేటర్ కు వచ్చి మరీ ఆదరిస్తున్నారు. చిన్న పెద్ద సినిమా అన్నది చూడడం లేదు. కంటెంట్ మీదనే దృష్టి పెడుతున్నారు.

ఇంకేమైనా కాంప్లిమెంట్లు వచ్చాయా విడుదలకు ముందే?

దిల్ రాజు నుంచి..ఈ సినిమా ఆయనే తీసుకున్నారు. ఆయనకు తెగనచ్చేసింది ఈ సినిమా. 

త్రివిక్రమ్ స్టయిల్ ఫన్ వుంటుందా?

ఆయన స్టయిల్ వుంటుంది..పైగా ఆయన అభిరుచులు కూడా కనిపిస్తాయి.

పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా అని వినిపిస్తోంది. మరి సూర్య సినిమా?

అవును డిస్కషన్ లో వుంది. ఒకసారి ఫైనల్ అయితే వివరాలు వెల్లడిస్తాను. సూర్య సినిమాపై ఇంకా డెసిషన్ తీసుకోలేదు. ఇంకా చాలా ప్లాన్ లు వున్నాయి. చేతిలో వున్న బాబు బంగారం, ప్రేమమ్ సినిమాలు పూర్తి కావాల్సి వుంది. 

థాంక్యూ..బెస్టాఫ్ లక్

థాంక్యూ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?