cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Interviews

పెట్టుబఢి పెడితేనే వాటా తీసుకుంటా

పెట్టుబఢి పెడితేనే వాటా తీసుకుంటా

రామ్ చరణ్. మెగాపవర్ స్టార్. పండగకు ధృవ, రంగస్థలం సినిమాలతో తన కెరీర్ ను మలుపు తిప్పేసుకుని, ఇప్పుడు బోయపాటి డైరక్షన్ లో వినయ విధేయ రామ సినిమాను సంక్రాంతి కానుకగా అభిమానులకు అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తో చిన్న చిట్ చాట్.

-విఎస్ఎన్

సినిమా ప్రమోషన్లు బాగా బోర్ కొట్టించేసి వుంటాయేమో?
అలాంటిదేమీ లేదు. ఇదంతా పార్ట్ ఆఫ్ సినిమానే కదా?

సినిమాలు కాస్సేపు పక్కన పెడదాం.. చరణ్ లో ఇటీవల చాలా మార్పు వచ్చింది. చరణ్ మాట, ప్రవర్తన అన్నీ మారాయి అన్న టాక్ వుంది. మీరేమంటారు?
అందరూ అంటున్నది అయితే ఏమోకానీ, మీ మీడియా వాళ్ల మాత్రం అడుగుతున్నారు. నా మటుకు నేను మామూలుగానే వున్నారు. గతంలో ఒకటి రెండు సంఘటనలు జరగడం, నేను డిఫరెంట్ గా రియాక్ట్ కావడం, ఇప్పుడు అలాంటవి ఏవీ లేకపోవడం వల్ల అలా అనుకుంటున్నారేమో? వాస్తవానికి జరిగే సంఘటనలను బట్టి మన ప్రవర్తన వుంటుంది.

పెళ్లయిన తరువాత నుంచి మెల్లగా మీలో ఈ మార్పు కనిపిస్తోందని అనుకోవచ్చా? అలాగే ఈ మార్పుకు కారణం మీ శ్రీమతి ఉపాసన అని కూడా అనుకోవచ్చా?
లేదు.. కాదు. మీరన్నట్లు లేదా అనుకంటున్నట్లు మార్పు ఏదైనావుంటే అది నా వయస్సు వల్ల లేదా రాను రాను ఆలోచనలు పరిణితి చెందడం వల్ల వచ్చి వుండాలి. అంతేకానీ కేవలం పెళ్లాం వల్లోనో, లేదా ఒక్క మనిషి వల్లనో ప్రపంచంలో ఎవ్వరూ మారిపోరు. అలా ఎవరైనా ప్రభావితం చేయగలిగితే అది కచ్చితంగా గురువులు అయివుంటారు.

పోనీ మీ పెళ్లయిన తరువాత సోషల్ యాక్టివిటీలు, పార్టీలు, కో స్టార్లను తరచు కలవడం పెరిగిందంటే ఒప్పుకుంటారా?
కొంతవరకు. పెళ్లయిన తరువాత చుట్టాలు, బంధుత్వాలు పెరుగుతాయి. అలా పార్టీలు కూడా పెరుగుతాయి. ఇక కోస్టార్లను కలవడం, పార్టీలు అవీ గతంలోనూ వున్నాయి. అయితే ఇటీవల సోషల్ మీడియా బాగా యాక్టివ్ కావడం వల్ల ఎక్కువగా ప్రచారానికి నోచుకుంటున్నాయి.

సైరా వంటి భారీ ప్రాజెక్టు టేకప్ చేయడం ద్వారా, ఈ వయస్సులో మీ నాన్నగారికి భారం పెంచారేమో? మెగాస్టార్ అలసిపోతున్నారని గ్యాసిప్ లు వస్తున్నాయి.
లేదు. నిజానికి నాన్నగారికి ఎంత ఎక్కువ పనివుంటే అంత ఆనందం. ఆయనే మమ్మల్ని తరుముతున్నాయి. త్వరగా చేయండి.. చేయండి అంటూ. ఆయన ఎనర్జీ లెవెల్స్ అలాంటివి.

సైరా సినిమా ఈ ఏడాది దసరాకా? లేక వచ్చే ఏడాది సంక్రాంతికా?
ఈ ఏడాదిలోనే తీసుకురావాలని అనుకుంటున్నాం. పోస్ట్ సమ్మర్ కు సినిమా రెడీ అయిపోతుంది.

కానీ 200 కోట్ల భారీ బడ్జెట్ సినిమా అంటే సమ్మర్, సంక్రాంతి నే కదా మన సీజన్లు.
నిజమే కానీ, పోస్ట్ సమ్మర్ లో కూడా మంచి రిజల్ట్ సాధించిన సినిమాలు మనకు వున్నాయి. మగధీర అలాంటి టైమ్ లోనే విడుదలయింది.

నిర్మాణం తలకెత్తుకోవడం వల్ల మీ కెరీర్ నెమ్మదిస్తుందన్న భయం లేదా?
లేదు. రెండింటినీ సమానంగానే హ్యాండిల్ చేస్తున్నా కదా?

సైరా బడ్జెట్?
కచ్చితంగా ఇప్పుడే చెప్పలేను. పూర్తయ్యే సరికి 200 కోట్లు దాటుతుందేమో?

అమితాబ్ పాత్ర నిడివి ఎక్కువేనా? లేదా కొద్దిసేపే వుంటారా?
లేదు. మంచి పాత్ర. నిడివి వున్న పాత్ర. అయితే ఆయన పరిమితులు దృష్టిలో వుంచుకుని, చకచకా ఆయన పార్ట్ మాత్రం త్వరగా షూట్ చేసేసాం.

బిగ్ బి వున్నారు కదా? బాలీవుఢ్ లో విడుదల చేస్తారా?
ఇప్పటికైతే ఆ ఆలోచన లేదు. సరైన పార్టనర్ దొరికితే చేసే అవకాశం వుంది. ప్రస్తుతానికైతే దక్షిణాది నాలుగు భాషల్లో మాత్రమే అనుకుంటున్నాం.

నిర్మాణ వ్యయం తగ్గాలి అంటారు. హీరోలు రెమ్యూనిరేషన్ తో పాటు లాభాల్లో వాటా తీసుకుంటారు. ఇది కరెక్టేనా?
నేను తీసుకోను. లాభాలు, మార్కెట్, ఆ లెక్కలు నాకెందుకు తలకాయనొప్పి, నాకు కావాల్సింది ముందే అడిగి తీసుకుంటా. లేదూ లాభాల్లో వాటా వుండాలి అంటే నేను కూడా నిర్మాతలతో సమానంగా పెట్టుబఢి పెడతా. అంతేకానీ, నా బ్యానర్ తగిలించి, లాభాల్లో వాటా ఇవ్వమని అడగను. రాబోయే మెగాస్టార్ -కొరటాల శివ కాంబినేషన్ సినిమా వుంది. దాంట్లో నాకు వాటా వుంది. నిర్మాత నిరంజన్ రెడ్డి గారితో సమానంగా నేను కూడా పెట్టుబఢి పెడతాను.

కమింగ్ బ్యాక్ టు వినయ విధేయ రామ. సంక్రాంతికి ఎవరైనా ఫ్యామిలీ సినిమాతో రావాలనుకుంటారు. మీరు ఇలా?
ఇది ఫ్యామిలీ సినిమా కాదని ఎవరన్నారు? ఈ సినిమా పక్కా ఫ్యామిలీ సినిమానే.

కానీ ట్రయిలర్, టీజర్, స్టిల్స్, ప్రోమోలు అన్నీ యాక్షన్ సీక్వెన్స్ ల చుట్టూ తిరుగుతున్నాయి.
అలా అనిపించి వుండొచ్చు. విడుదల చేసిన తొలిపాట ఫ్యామిలీ మీదే వుంటుంది కదా. అలాగే అన్నదమ్ములు, వదినలు వున్న కుర్రాడి కథ ఇది. రేపటి నుంచి ఈ జోనర్ లో ప్రొజెక్ట్ చేయడం ప్రారంభిస్తాం.

ఈ సినిమాలో కనీసం మూడు వందల మందిని హీరో చంపుతాడని.. నిజమేనా?
(నవ్వేస్తూ)... మగధీరలో వంద మందిని చంపితే చూసారు. మూడు వందల మందిని చంపితే చూడరా?

నిర్మాత దానయ్యతో హ్యాపీనా?
హండ్రెడ్ పర్సంట్. అస్సలు వెనక్కు తగ్గని నిర్మాత. అందుకే త్రివిక్రమ్-మెగాస్టార్ సినిమాను ఆయనకు అప్పగించాం.

ఆర్ ఆర్ ఆర్ లో మీ లుక్ ఎలా వుండబోతోంది?
చాలా కామన్ గా వుంటుంది. ప్రస్తుతానికి పెద్దగా ప్రత్యేకతలేమీ వుండవు గెటప్ వరకు.

ధృవ.. రంగస్థలం.. ఇప్పుడు వినయ విధేయతో హ్యాట్రిక్ కొట్టబోతున్నారని అనుకోవచ్చా?
తప్పకుండా. ఈ సినిమా కచ్చితంగా మాస్ ఆడియన్స్ కు, ఫ్యామిలీ ఆఢియన్స్ కు నచ్చే సినిమా అవుతుంది.

థాంక్యూ అండీ
థాంక్యూ

రామ్ చరణ్ ఫోటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి 

జగన్‌తో పవన్‌ పొత్తు ఎందుకు కుదరలేదంటే?

 


×