Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సైరా తరహాలో ఎన్టీఆర్ బయోపిక్ డీల్

సైరా తరహాలో ఎన్టీఆర్ బయోపిక్ డీల్

ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు తగిలితే కోట్లు కుమ్మరించడానికి రెడీ అమెజాన్. ఇప్పటికే సైరా సినిమాను రికార్డు ధరకు దక్కించుకున్న ఈ సంస్థ, ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ పై కన్నేసింది. సేమ్ టు సేమ్ సైరా తరహాలోనే ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి కూడా భారీ డీల్ సెట్ చేసుకునే ప్లానింగ్ లో ఉంది. 

సైరా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ఏకంగా 30కోట్ల రూపాయల మొత్తానికి దక్కించుకుంది అమెజాన్. ఈ మేరకు కేవలం సినిమాను మాత్రమే అది స్ట్రీమింగ్ లో పెట్టదు. సైరాకు సంబంధించిన కీలకమైన ఇంటర్వ్యూలతో పాటు మేకింగ్ వీడియోస్ ను కూడా స్ట్రీమ్ చేయబోతోంది. ఇప్పుడు ఇదే తరహాలో ఎన్టీఆర్ బయోపిక్ డీల్ కూడా సెట్ చేసుకునే ఆలోచనలో ఉంది.

డీల్ సెట్ అయితే ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించిన మేకింగ్ వీడియోస్ ను కూడా అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చన్నమాట. సైరా, ఎన్టీఆర్ బయోపిక్ లాంటి ప్రాజెక్టులు కేవలం సినిమాలగానే కాకుండా, మేకింగ్ పరంగా కూడా ఆసక్తి రేకెత్తిస్తాయి. అందుకే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్రపోజల్ తో ముందుకొచ్చింది అమెజాన్ సంస్థ. 

మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్ డిజిటల్ రైట్స్ పై వస్తున్న పుకార్లలో కూడా వాస్తవం లేదు. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ 30కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇంకా డీల్ కుదరలేదు. ప్రస్తుతానికి చర్చలు సాగుతున్నాయి. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కింద 16 నుంచి 20 కోట్ల వరకు ఆదాయం రావొచ్చని మేకర్స్ ఆశిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?