Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఈ వయసులో చిరంజీవి వల్లవుతుందా?

ఈ వయసులో చిరంజీవి వల్లవుతుందా?

నమ్మడానికి కాస్త కష్టమే కానీ మెగాస్టార్ చిరంజీవి వయసు ఇప్పుడు అరవై అయిదేళ్లు. ఈ వయసులో ఆయన కమర్షియల్ సినిమాలు చేసి అందరినీ మెప్పించడం అంత తేలిక కాదు. 

సైరా నరసింహారెడ్డిలో పోరాట సన్నివేశాలలో డూప్‌ని వాడిన సంగతి ఫాన్స్ కూడా గ్రహించేసారు. దాంతో ఇక ఫిజికల్ స్ట్రెస్ అవసరం లేని పాత్రలు చేయాలని సెన్సిబుల్ ఫాన్స్ సజెస్ట్ చేసారు. 

కానీ ‘ఆచార్య’ చిత్రంలో చిరంజీవి ఎప్పటిలా డాన్సులు, ఫైట్లు చేయాలని చూస్తున్నారు. ఖైదీ నంబర్ 150 బాగా ఆడింది కనుక ఇప్పుడు కూడా తన డాన్సులు, ఫైట్ల కోసం జనం బారులు తీరతారని చిరంజీవి భావిస్తున్నారు. అందుకే వేదళాం రీమేక్ కూడా లైన్లో పెట్టి వుంచారు. 

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ అరవయ్యేళ్లు రాకుండానే క్యారెక్టర్ పాత్రలకు షిఫ్ట్ అయిపోయి తన వయసుకి తగ్గ పాత్రలతోనే కెరీర్ ఎక్స్‌టెండ్ చేసుకున్నారు. 

రజనీకాంత్ ఇంకా హీరో పాత్రలు విడిచి పెట్టలేక బాక్సాఫీస్ వద్ద స్ట్రగుల్ అవుతూనే వున్నారు. వాళ్ల ఎగ్జాంపుల్స్ తీసుకుని అయినా ఇక చిరంజీవి మాస్ క్యారెక్టర్లు మానేసి ఇక యువ హీరోలతో కలిసి సినిమాలు చేస్తే ఆయనేక కాకుండా తెలుగు సినిమా పరిశ్రమకు కూడా పెద్ద ప్లస్ అవుతుంది. 

పవన్ కు ఒక నీతి.. ప్రకాష్ రాజ్ కు మరో నీతి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?