Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇస్మార్ట్ ఉస్తాద్ సెన్సార్

ఇస్మార్ట్ ఉస్తాద్ సెన్సార్

మీరు చదివింది నిజమే.. ఇస్మార్ట్ ఉస్తాద్ శంకర్ ను ఇకపై ఇస్మార్ట్ ఉస్మాద్ సెన్సార్ అని పిలుచుకోవచ్చు. అవును.. సెన్సారోళ్లకు చేతినిండా పనిపెట్టబోతున్న సినిమా ఇది. కేవలం డైలాగ్స్ లోనే కాదు, సన్నివేశాల్లో కూడా విచ్చలవిడిగా విశృంఖలత్వం పొంగిపొర్లిందట. సెన్సార్ లో ఈ సినిమాకు ఇక్కట్లు తప్పవని స్వయంగా ఆ సినిమాకు పనిచేసిన యూనిట్ సభ్యులే చెబుతున్నారు.

అంతెందుకు, నిన్న రిలీజైన ట్రయిలర్ లో డైలాగ్స్ కూడా యాజ్ ఇటీజ్ గా థియేటర్ లో ఉండవు. అందులో చూపించిన కొన్ని సీన్లు కూడా కట్ అవ్వడం గ్యారెంటీ. వీటితో పాటు కత్తెరకు పనిచెప్పే ఎన్నో మసాలా సన్నివేశాలు ఇస్మార్ట్ శంకర్ లో ఉన్నాయని అంటున్నారు వాళ్లు. సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు కాబట్టి ట్రయిలర్ పై ఎలాంటి అభ్యంతరాలు లేవు. రిలీజ్ కు ముందు ఇచ్చే టీవీ యాడ్స్ లో మాత్రం చాలా మెటీరియల్ కట్ అవుతుంది.

పూరి జగన్నాధ్ సినిమాల్లో బోల్డ్ సీన్లు కామన్. హీరోయిన్లతో కూడా పచ్చిగా డైలాగ్స్ చెప్పిస్తుంటాడు ఈ దర్శకుడు. ఈ సినిమాలో కూడా అదే చేశాడనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది. కానీ ఈసారి పూరి కాస్త శృతిమించాడని అంటున్నారు. మరీ ముఖ్యంగా రొమాంటిక్ సీన్లు, తెలంగాణ యాస డైలాగ్స్ లో పీక్స్ కు వెళ్లిపోయాడని చెబుతున్నారు. వాటిలో చాలా భాగం సెన్సార్ కత్తెరకు బలికాక తప్పదని తెలుస్తోంది.

సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తయింది. టాకీ పార్ట్ ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయింది. పాటల ఎడిటింగ్ ప్రస్తుతం నడుస్తోంది. మూడో వారంలో (అన్నీ అనుకున్నట్టు జరిగితే 15న) ఈ సినిమా సెన్సార్ గుమ్మం తొక్కనుంది. రీసెంట్ గా వచ్చిన ఫలక్ నుమా దాస్ అనే సినిమాకు కూడా ఇలానే భారీగా కోతలు పడ్డాయి.

దొరసాని మనసెరిగిన దొర.. ఏమి చెప్పాడో తెలుసా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?