Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అఖిల్ టైపులో మోక్షజ్ఞను లాంచ్ చేస్తారా..?

అఖిల్ టైపులో మోక్షజ్ఞను లాంచ్ చేస్తారా..?

అఖిల్ ఇండస్ట్రీకి ఎలా పరిచయమయ్యాడో గుర్తుందా..? మనం సినిమాలో క్లైమాక్స్ లో ఇలా వచ్చి అలా మెరుస్తాడు. ఆ సినిమాతోనే అఖిల్ వెండితెరకు పరిచయమవ్వడానికి ఓ బలమైన కారణం ఉంది. ఎందుకంటే అది మూడుతరాల అక్కినేని ఫ్యామిలీ హీరోలు కలిసి నటించిన వెరీ వెరీ స్పెషల్ మూవీ. 

ఇప్పుడు అలాంటి సందర్భమే నందమూరి కాంపౌండ్ లో కూడా వచ్చింది. అదే ఎన్టీఆర్ బయోపిక్. నటసార్వభౌమ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర తెరపైకొస్తోంది. స్వయంగా బాలకృష్ణ ఇందులో నటిస్తున్నాడు. ఇలాంటి స్పెషల్ మూవీతో మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేస్తే బాగుంటుందనేది దర్శకుడు క్రిష్ ఆలోచన. దీనికోసం అతడు ప్రత్యేకంగా ఓ పాత్ర కూడా సిద్ధం చేశాడు. ఇదే విషయాన్ని బాలయ్యతో చర్చించాడు కూడా. 

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఎన్టీఆర్ బయోపిక్ లో మోక్షజ్ఞ కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే ఈ బయోపిక్ లో మోక్షజ్ఞకు ఎలాంటి పాత్ర ఇస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, సినిమాలో దాదాపు కీలకమైన పాత్రలన్నింటినీ బాలయ్యే పోషిస్తున్నాడు. మిగతా నందమూరి హీరోలెవరికీ ఇందులో చోటులేదు. ఇలాంటి సినిమాలో మోక్షజ్ఞకు కీలకపాత్ర అంటే కాస్త ఆలోచించాల్సిందే. 

నిజానికి బాలయ్య వందోచిత్రం గౌతమీపుత్ర శాతకర్ణితోనే మోక్షజ్ఞను తెరపైకి తీసుకురావాలనుకున్నారు. అప్పట్లోనే క్రిష్ ఈ ప్రతిపాదన చేశాడు. కానీ ఎందుకో అప్పట్లో వర్కవుట్ కాలేదు. ఈసారి ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా మరోసారి అదే ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చాడు క్రిష్. మరి ఈసారి క్రిష్ సక్సెస్ అవుతాడా..? మోక్షజ్ఞను లాంఛ్ చేసే అవకాశం దక్కించుకుంటాడా..? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?