Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నిజంగానే 'అ!' అనిపించిన నాని

నిజంగానే 'అ!' అనిపించిన నాని

థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. ఓ కొత్త ప్రయత్నమైతే చేశారంటూ మెచ్చుకోళ్లు వస్తున్నాయి తప్ప వసూళ్లు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రేక్షకులందరితో ఏకగ్రీవంగా 'అ!'  అనిపించలేకపోయింది ఈ సినిమా.

అయితే మరో యాంగిల్ లో మాత్రం 'అ!' అనిపిస్తోంది. ఈసారి ఆశ్చర్యంతో అంటున్న 'అ!' ఇది. ఈ సినిమాకు సంబంధించి శాటిలైట్ డీల్ ఇంకా పూర్తికాలేదు. రిలీజ్ కు ముందే సినిమా కొనేందుకు కొన్ని ఛానెల్స్ ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు. దీనికి కారణం నాని చెప్పిన రేటు.

అవును.. ఈ సినిమాకు 5కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడట నిర్మాత నాని. ఎలాంటి కమర్షియల్ హంగులు లేని ఈ సినిమాకు 5 కోట్లు అడిగేసరికి ఛానెల్స్ అన్నీ 'అ!'వాక్కయ్యాయి. అటుఇటుగా 3కోట్లు పెట్టి ఈ సినిమా తీశాడు నాని. రిలీజ్ కు మరో కోటి ఖర్చుపెట్టాడు. అలా 4కోట్లతో తీసిన సినిమాకు ఒక్క శాటిలైట్ కే 5కోట్లు డిమాండ్ చేశాడట.

అయితే ఇదంతా 'అ!' విడుదలకు ముందు వ్యవహారం. ప్రస్తుతం మిక్స్ డ్ టాక్ తో నడుస్తున్న ఈ సినిమాను ఏ ఛానెల్, ఎంత పెట్టి తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ట్రేడ్ వర్గాలు చెబుతున్న ప్రకారం.. నానికి మిగిలేవి ఈ శాటిలైట్ డబ్బులే అని తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?