Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రాజమౌళి టెన్షన్‌ తీర్చిన ఆలియా

రాజమౌళి టెన్షన్‌ తీర్చిన ఆలియా

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌.’లో ఆలియా భట్‌ని కథానాయికగా అనౌన్స్‌ చేసి చాలా కాల‌మవుతోంది. చరణ్‌ సరసన కథానాయికగా ఆమెని ఎంపిక చేసారు. ఈ చిత్రానికి జాతీయ వ్యాప్తంగా అప్పీల్‌ రావడానికి ఆలియా ముఖ్య పాత్ర పోషిస్తుందని రాజమౌళి నమ్మకం. అయితే బాలీవుడ్‌ చిత్రాతో చాలా బిజీగా వున్న ఆలియా భట్‌ ఈ చిత్రానికి ఇంతవరకు డేట్స్‌ ఇవ్వలేకపోయింది.

ఆలియా భట్‌ ఎక్కువ డేట్స్‌ ఇవ్వలేదని అర్థమయిన తర్వాత ఆమె పాత్రని కుదించారని కూడా వదంతులు వినిపించాయి. ఎట్టకేల‌కు ఆలియా ఏప్రిల్‌ నుంచి షూటింగ్‌కి వస్తుందని అనుకుంటే ఈలోగా కరోనా తల‌పోటు వచ్చి షూటింగ్‌ నిలిచిపోయింది. దీంతో ఆలియా డేట్స్‌ మళ్లీ ఎప్పటికి దొరుకుతాయనే టెన్షన్‌ రాజమౌళిని వేధిస్తోంది.

అయితే ఎప్పుడు మళ్లీ షూటింగ్‌ స్టార్ట్‌ అయితే అప్పుడు వచ్చి ముందుగా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌.’ పూర్తి చేస్తానని, ఆ తర్వాతే వేరే చిత్రాకి డేట్స్‌ ఇస్తానని ఆలియా చెప్పిందట. ఆమె రావడం లేటయితే ఈ చిత్రం మళ్లీ డిలే అవుతుందని వ్యక్తమవుతున్న అనుమానాల‌కి కూడా ఈ వార్త తెర వేస్తుంది. ఆలియా అందుబాటులోకి రాగానే చరణ్‌, ఆమెపై తీయాల్సిన పాట పూర్తి చేసి తర్వాత టాకీతో పాటు కొన్ని యాక్షన్‌ సీన్స్‌ తీస్తారట. దాంతో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌.’ షూటింగ్‌ దాదాపుగా పూర్తవుతుందని సమాచారం. 

లాక్ డౌన్ ఎత్తేస్తున్నారా ?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?