Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రకుల్ బాలీవుడ్ ఆశలు గల్లంతు

రకుల్ బాలీవుడ్ ఆశలు గల్లంతు

కొత్త ఏడాదిలో కొత్తగా బాలీవుడ్ లో దూసుకుపోదాం అనుకుంది. ఎన్నో ఆశల మధ్య అయ్యారీ సినిమా చేసింది. కానీ ఈ సినిమా మాత్రం రకుల్ కు కలిసిరాలేదు. దీంతో ఆమె బాలీవుడ్ ఆశలు గల్లంతయ్యాయి.

సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కింది అయ్యారే చిత్రం. హీరోను పక్కనపెడితే నీరజ్ పాండేపై ఉన్న నమ్మకంతో ఈ సినిమా చేసింది. మూవీకి ప్రచారం కూడా బాగానే చేసింది. ఈ గ్యాప్ లో సినిమా 2 సార్లు వాయిదాపడింది.

పద్మావత్ కారణంగా ఒకసారి, ప్యాడ్ మేన్ కారణంగా మరోసారి పోస్ట్ పోన్ అయింది. ఇలా వాయిదాపడిన ప్రతిసారి ఓపిగ్గా ప్రచారం కల్పించింది రకుల్. కానీ ఆమె కష్టానికి తగిన ఫలితం మాత్రం దక్కలేదు.

నిన్న రిలీజైన అయ్యారీ సినిమాకు మంచి రివ్యూస్ రాలేదు. గతంలో నీరజ్ పాండే తీసిన ఎ వెడ్నస్ డే, స్పెషల్ ఛబ్బీస్, ఎమ్మెస్ ధోని లాంటి సినిమాలతో పాల్చి చూస్తే అయ్యారీ చిత్రం ఏమాత్రం మెప్పించదంటూ సమీక్షలు వస్తున్నాయి. దీంతో రకుల్ ఆశలపై నీళ్లు చల్లినట్టయింది.

ఆమె బాలీవుడ్ కెరీర్ కు ఇంకొక్క ఛాన్స్ మాత్రం ఉంది. అజయ్ దేవగన్ రకుల్ కు ఓ అవకాశం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉంది. ఇది కూడా ఫ్లాప్ అయితే రకుల్ ఇక ఎంచక్కా సౌత్ సినిమాలపైనే ఫోకస్ పెట్టుకోవచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?