Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రీమేక్‌లు పట్రండి అంటోన్న పవన్

రీమేక్‌లు పట్రండి అంటోన్న పవన్

పవన్ కళ్యాణ్‌కి మొదట్నుంచీ రీమేక్ సినిమాల పట్ల మోజెక్కువ. రీమేక్ సినిమాల కోసం నెలల తరబడి కూర్చోవాల్సిన పనుండదు. పైగా ఆ సినిమాలు ఎలా వుంటాయనేది ముందే ఒక ఐడియాకి రావచ్చు. 

అదీ కాకుండా ఇప్పుడు పవన్ తక్కువ రోజుల్లో సినిమాలు పూర్తి చేసే మహాయజ్ఞం చేస్తున్నాడు. ఎంత తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తి చేయగలిగితే పవన్‌కి అంతెక్కువ ఆదాయం. 

అందుకే పవన్ వకీల్ సాబ్ తర్వాత అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్‌ని అంత అర్జంటుగా ట్రాక్ ఎక్కించాడు. ఇక మీదట కూడా రీమేక్ కథలు తీసుకురమ్మని ముప్పయ్ నుంచి యాభై రోజుల్లోపు తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసేయమని చెబుతున్నాడు. 

ఒరిజినల్ కథలు చెబతోన్న దర్శకులతో కూడా రీమేక్ సుఖం కదా అంటున్నాడట. క్రిష్‌తో సినిమా వెనక్కు నెట్టి రీమేక్స్‌ని వేగంగా పూర్తి చేయడం, హరీష్ శంకర్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా తాత్సారం చేయడం బట్టే పవన్ ఎంతగా రీమేకులపై ఆసక్తిగా వున్నాడనేది స్పష్టమవుతోంది. 

రెండేళ్లలో కనీసం అయిదారు సినిమాలు చేయాలంటే పవన్ స్ట్రాటజీ కూడా కరేక్టనేమో మరి. 

వ్రతం చెడినా, ఫలితమైనా దక్కుతుందా? 

దర్శకుడిగా మారుతున్న రవితేజ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?