Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

1983-బాబు-దగ్గుబాటి ఎవరు కీలకం?

1983-బాబు-దగ్గుబాటి ఎవరు కీలకం?

1983లో ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో పార్టీలో చంద్రబాబు పరిస్థితి ఏమిటి?

చిన్న అనుమానం. ఎన్టీఆర్ పార్టీ పెట్టాక, 1983లో చంద్రబాబు కాంగ్రెస్ లో వున్నారు. పార్టీ ఆదేశిస్తే ఎన్టీఆర్ మీద పోటీచేస్తా అని సవాల్ విసిరారు. కానీ ఆ తరువాత ఎన్టీఆర్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఎన్టీఆర్ సిఎమ్ అయిన తరువాత పార్టీలోకి వచ్చారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యే నాటికి పార్టీలో కీలకంగా వున్నది దగ్గుబాటి వెంకటేశ్వర రావునే. కార్యకర్తలందరికీ ఆయన డాక్టర్ గారు. అలాగే పరిచయం. అంతకు ముందు కూడా ఎన్టీఆర్ అభిమానులకు నిర్మాతగా పరిచయం. అటు ఎఎన్నార్-ఇటు ఎన్టీఆర్ కాంబినేషన్ లో హిందీ మూవీ ఆధారంగా సత్యం-శివం అనే సినిమాను నిర్మించారు.

ఇలాంటి నేపథ్యంలో, ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో దగ్గుబాటి పాత్ర ఏ మేరకు వుంటుందన్నది సందేహంగా వుంది. ఎందుకంటే చిన్నల్లుడు చంద్రబాబు పాత్రను నోటెడ్ నటుడు రానా పోషిస్తున్నాడు. ఆయన పాత్ర చాలా కీలకంగా వుండబోతోందని ఇప్పటికే ఫీలర్లు బయటకు వచ్చాయి. ఎఎన్నార్ పాత్ర పోషించిన సుమంత్ కూడా, తను రానా కలిసి ఎన్టీఆర్ ప్రమాణస్వీకారంలో సీన్ ను ఫినిష్ చేసామని వెల్లడించారు.

ప్రమాణ స్వీకారం సీన్లలో అక్కినేనితో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్ర కాంబినేషన్ వుండాలి కానీ, చంద్రబాబు పాత్ర వుండడం ఏమిటో? ఎందుకంటే అప్పటికి చంద్రబాబు తెలుగుదేశంలో అంత కీలకం కాదు. పోనీ ఆ సంగతి అలా వుంచినా దగ్గుబాటి పాత్ర కూడా ప్రమాణ స్వీకారం టైమ్ లో వుండి వుండాలి?

సుమంత్ ప్రమాణ స్వీకారం సీన్ షూట్ అయిపోయిందని చెబుతున్నారు. అంటే దగ్గుబాటి పాత్ర కూడా అక్కడ వుండి వుండాలి. మరి ఆ పాత్ర ఎవరు పోషిస్తున్నారో? ఆ లుక్ ఎలా వుందో? ఎందుకు రివీల్ చేయడం లేదు. అదే విధంగా దగ్గుబాటి భార్య పురంధ్రీశ్వరి పాత్రను విజయవాడకు చెందిన ఓ అమ్మాయి పోషిస్తోందని సోషల్ నెట్ వర్క్ లో లీక్ అయింది తప్ప, యూనిట్ ఇప్పటి వరకు ప్రకటించలేదు.

ఇదంతా చూస్తుంటే ఎన్టీఆర్ బయోపిక్ లో దగ్గుబాటి దంపతుల పాత్రలు అంతంత మాత్రమే అని అనుమానం కలుగుతోంది. ఇప్పటికే బయోపిక్  స్క్రిప్ట్ ను తెరవెనుక చంద్రబాబు ప్రభావితం చేసారని గుసగుసలు వున్నాయి. ఇప్పుడు సుమంత్ చెప్పిన విషయాలతో అవి పక్కాయేమో అన్న అనుమానం కలుగుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?