Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

23 నుంచి వకీల్ సాబ్

23 నుంచి వకీల్ సాబ్

కరోనా కల్లోలం మెలమెల్లగా తగ్గుముఖం పడుతోంది. కరోనా తగ్గుముఖం కన్నా, కరోనా భయం తగ్గుముఖం పడుతోంది అనడం సరైనదేమో? మొత్తం మీద టాలీవుడ్ ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతోంది. షూటింగ్ లు ఒకటీ ఒకటీ స్టార్ట్ అవుతున్నాయి. చాలా సినిమాలకుషెడ్యూళ్లు వేసుకుంటున్నారు. ప్లాన్లు చేసుకుంటున్నారు.

సంక్రాంతి టార్గెట్ గా రెడీ కావాలనుకుంటున్న పవర్ స్టార్ వకీల్ సాబ్ కూడా షెడ్యూలుకు రెడీ అవుతోంది. ఈ నెల 23 నుంచి ఈ సినిమా మళ్లీ సెట్ మీదకు వెళ్లబోతున్నట్లు బోగట్టా. ఈ సినిమా కోసం సుమారు అటు ఇటుగా ముఫై రోజుల షూటింగ్ వర్క్ వుందని తెలుస్తోంది. ఇందులో పవన్ వర్క్ 15 రోజులు వుంటుందని బోగట్టా.

ముందుగా పవన్ లేని వర్క్ లు పూర్తి చేయడమా? లేక వీలును బట్టి అటు ఇటుగా అన్ని సీన్లు కానివ్వడమా? అనేది డిస్కషన్ లో వుంది. ఈ మేరకు పవన్ తో కూడా డిస్కషన్లు, ఫైనల్ డెసిషన్లు కూడా అయిపోయినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే చకచకా అక్టోబర్ చివరి నాటికి టోటల్ షూట్ పార్ట్ పూర్తయిపోతుంది. సంక్రాంతికి చాలా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాయి. అయితే పెద్ద సినిమాగా వకీల్ సాబ్ మాత్రమే వుంటుంది.

రైతుల్ని భ్రమల్లోనే ఉంచుతున్న బాబు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?