96 చూసిన నాని

నిర్మాత దిల్ రాజు తొలిసారి ఓ రీమేక్ సినిమా చేయబోతున్నారు. ఆయన విషయంలో ఇది రికార్డే. తమిళంలో గత రెండేళ్లుగా మేకింగ్ లో వుండి, త్వరలో విడుదల కాబోతున్న సినిమా 96. ఈ సినిమా…

నిర్మాత దిల్ రాజు తొలిసారి ఓ రీమేక్ సినిమా చేయబోతున్నారు. ఆయన విషయంలో ఇది రికార్డే. తమిళంలో గత రెండేళ్లుగా మేకింగ్ లో వుండి, త్వరలో విడుదల కాబోతున్న సినిమా 96. ఈ సినిమా హక్కులను కోటీ పది లక్షలకు దిల్ రాజు కొన్న సంగతి గతంలోనే వెల్లడించాం. ఇప్పుడు ఈ సినిమాను హీరో నానికి దిల్ రాజు ప్రత్యేకంగా చూపించినట్లు తెలుస్తోంది.

త్రిష, విజయ్ సేతుపతి కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా 1996 బ్యాచ్ క్లాస్ మేట్ల మధ్య ప్రేమ నేపథ్యంలో సాగుతుంది. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ దిల్ రాజుకు పిచ్చ పిచ్చగా నచ్చేసి, రీమేక్ రైట్స్ కొన్నారు. నానితో ఓ సినిమా చేయాల్సి వుంది దిల్ రాజు. అందుకే 96 సినిమాను నానికి చూపించారట. నానికి కూడా ఈ సినిమా నచ్చినట్లు తెలుస్తోంది. 

అయితే మరి నాని ఓకె అన్నారా? అలా అంటే డైరక్టర్ ఎవరు? హీరోయిన్ ఎవరు అన్నవి అన్నీ ఇంకా ముందు ముందు తెలియాల్సి వుంది. నాని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అన్నది ఇప్పుడు పెండింగ్ లో వుంది. నాని గ్రీన్ సిగ్నల్ ఇస్తే, దిల్ రాజు తొలిసారి ఓ రీమేక్ కు శ్రీకారం చుడతారు.