Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ సినిమా కోసం శేఖర్ కమ్ముల

ఆ సినిమా కోసం శేఖర్ కమ్ముల

శేఖర్ కమ్ముల ఓ డిఫరెంట్ డైరక్టర్. సాధారణంగా తన సినిమాల గురించి తప్ప, మిగిలిన వ్యవహారాలు పెద్దగా పట్టవు. సినిమాలు చూస్తాడు. ఊరుకుంటాడు తప్ప, కితాబులివ్వడం వంటి వ్యవహారాలు పెద్దగా వుండవు.

అసలు ఆ మాటకు వస్తే పబ్లిక్ లోకి వచ్చేదే తక్కువ. అలాంటి శేఖర్ కమ్ముల ఓ సినిమాకు సపోర్ట్ గా నిలిచాడు. కొత్త దర్శకుడు కాస్త భిన్నంగా తీసి ‘నీదీ నాదీ ఒకే కథ’ సినిమా గురించి విడియో బైట్ నే ఇచ్చాడు శేఖర్ కమ్ముల.

వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్న శ్రీవిష్ణు హీరోగా రెడీ అయిన ‘నీదీ నాదీ ఒకే కథ’ సినిమాను శేఖర్ కమ్ముల ముందుగా చూడడమే కాదు, చిన్న మినీ విడియో రివ్యూనే ఇచ్చాడు.

సినిమా చాలా బాగుందని, శ్రీవిష్ణు బాగా చేసాడని, డైరెక్టర్ ఫస్ట్ సినిమాకు ఇలాంటి సబ్జెక్ట్ తీసుకోవడం చిన్న విషయం కాదని, ఇటు ఎంటర్ టైన్ మెంట్ అటు ఎమోషన్ బాగా పండిందని, ఇలా చాలా చెప్పాడు శేఖర్ కమ్ముల. పనిలో పనిగా విద్యా వ్యవస్థ, తల్లితండ్రుల వైఖరిని కూడా కాస్త ప్రస్తావించాడు.

సాధారణంగా ఎవరికీ అంత సులువుగా అప్లాజ్ ఇవ్వని శేఖర్ కమ్ముల విడియో బైట్ సంపాదించారు నీదీ నాదీ ఒకే కథ మేకర్లు. ఇప్పటి దాకా విడుదలయిన టీజర్లు, ప్రోమోలు, ట్రయిలర్లు ప్రామిసింగ్ గానే వున్నాయి. మరి సినిమా ఎలా వుంటుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?