సినిమా డైరక్టర్లు అంటే సవాలక్ష టెన్షన్లు వుంటాయి. చికాకులు వుంటాయి. అయినా అందరినీ కలిపేసుకుని, ఏదో విధంగా నెట్టుకుంటూ పోవాల్సిందే. చాలా మంది డైరక్టర్లు చేసేది అదే.
తన డిపార్ట్ మెంట్ జనాల మీద కాస్త కస్సు బుస్సులాడతారు తప్ప, మిగిలిన వారితో వీలయినంత స్మూత్ గా పని చేయిుంచుకుపోవాలనే చూస్తారు. కానీ టాలీవుడ లో ఓ డైరక్టర్ వ్యవహారంతో ఆ ప్రొడక్షన్ హవుస్ నే తలపట్టుకుంటోందట.
ఆఫీసు బాయ్ దగ్గర నుంచి ఎడిటర్ వరకు, పీఆర్వో నుంచి ప్రొడక్షన్ మేనేజర్ వరకు అందరితోనూ చిన్న చితక వివాదాలే అని టాక్ వినిపిస్తోంది. దీంతో సినిమా పూర్తి చేసుకుని, స్మూత్ గా విడుదల చేసుకోవడం అవసరం కాబట్టి ఏమీ మాట్లాడలేక అలా నెట్టుకుంటూ వస్తున్నారట.
ఎంత కోపం అంటే తన పేరులో రెండు పదాలు అటు ఇటు బదులు అటు ఇటుగా ఉచ్చరించినా కోపమేనంట. ఆ మధ్య ఓ కార్యక్రమం అరేంజ్ చేస్తే, పాపం టైమ్ కు టంఛన్ గా వచ్చేసాడట.
కానీ అరేంజ్ చేసిన వాళ్లు మరొక్క పావుగంట పడుతుంది అనేసరికి ముందుగా చెప్పడం తెలియదా? అంత ఖాళీగా వున్నాననుకున్నారా? అంటూ గట్టిగా క్లాస్ పీకేసరికి ఆ జనాలు గుడ్లు తేలేసారంట. సినిమా విడులయ్యేవరకు ఈ కోపం భరించాల్సిందే అనుకుంటున్నారట యూనిట్ అంతా.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు