Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'ఆ హీరోతోనే సినిమా చేసుకో'

'ఆ హీరోతోనే సినిమా చేసుకో'

హీరోల మధ్య పోటీలు మాత్రమే కాదు. ఈగోలు కూడా ఓ రేంజ్ లో వుంటాయి. అవేమీ పెద్దగా దాచుకోరు. మొహమాటం లేకుండా కక్కేస్తారు. ఈ మధ్య ఓ స్టార్ హీరో ఓ డైరక్టర్ కు ఇలాగే దాచుకోకుండా మెసేజ్ చేసినట్లు తెలుస్తోంది. 

విషయం ఏమిటంటే ఒక కొత్త దర్శకుడు పెద్ద హిట్ కొట్టాడు. దాంతో క్రేజ్ వచ్చింది. తరువాత సినిమా ఏ హీరోతోనా అని డిస్కషన్లు స్టార్ట్ అయ్యాయి. ఓ టాప్ హీరోకు లైన్ కూడా చెప్పినట్లు వార్తలు వినవచ్చాయి.

ఇదిలా వుంటే మొన్నామధ్య అదే డైరక్టర్ మరో హీరో కు చెందిన ఫంక్షన్ లో పాల్గొనాల్సి వచ్చింది. పనిలో పనిగా కాస్త హుషారుగా ఆ హీరో గురించి ఎక్కువ మాట్లాడేసాడు. 

ప్రసంగం అయిపోయిన తరువాత సినిమా చేద్దాం అనుకుంటున్న హీరో నుంచి మెసేజ్ వచ్చేసింది. 'బాగా పొగుడుతున్నావ్ గా, మరి నాతో ఎందుకు సినిమా ఆ హీరో తోనే చేసుకో' అనే విధంగా. 

పాపం ఆ డైరక్టర్ బిక్క మొహం వేసుకుని పక్కనున్న వారికి ఆ మెసేజ్ చూపించి, ఇప్పుడు ఏం చేయాలని అడగడం కొసమెరుపు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?