Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఏజెంట్..ఓ తెల్ల ఏనుగు?

ఏజెంట్..ఓ తెల్ల ఏనుగు?

అంతన్నాడు..ఇంతన్నాడే గంగరాజు..అన్నది ఓ సరదా పాట. అఖిల్ హీరోగా తయారవుతున్న ఏజెంట్ సినిమా బడ్జెట్ వ్యవహారం ఇలాగే వుంది టాలీవుడ్ లో గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. సరైన హిట్ లేని అక్కినేని అఖిల్ సినిమా మీద ఇప్పటి పరిస్థితుల్లో మహా అయితే 30 నుంచి 40 కోట్ల బడ్జెట్ పెట్టొచ్చు. కానీ ఈ సినిమాకు బడ్జెట్ దానికి డబుల్ అంటే దాదాపు 80 కోట్లు అన్నమాట.

విషయం ఏమిటంటే నిర్మాత అనిల్ సుంకర హీరో అఖిల్-దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ చేసారు. ఈ ప్రాజెక్ట్ ఓ తెల్ల ఏనుగులా మారిందన్న కామెంట్లు ఇండస్టీలో వినిపిస్తున్నాయి. మంచి ప్రామిసింగ్ ప్రాజెక్టు కదా అని ప్రారంభించారు. ముఫై కోట్లలో పూర్తి చేయొచ్చు అని చెప్పారట ఆరంభంలో సురేందర్ రెడ్డి. తాను భాగస్వామిగా వుండానని కూడా అన్నారట.

కానీ ఆ తరువాత అది అలా అలా 40 కోట్లు..యాభై కోట్లు..అరవై కోట్ల కు వెళ్లిపోతోందని తెలుస్తోంది. ఆఖరికి పూర్తయ్యేసరికి, వడ్డీలు, పబ్లిసిటీ అన్నీ కలిపి 80 కోట్లకు చేరిపోతుందని టీమ్ లోని ఓ కీలక వ్యక్తి అంచనా. ఇదిలా వుంటే బడ్జెట్ 40 కోట్లు దాటిన తరువాత భాగస్వామ్యం నుంచి సురేందర్ రెడ్డి తప్పుకున్నారని తెలుస్తోంది. కానీ నిర్మాతల పేరులో ఆయన భార్య పేరు మాత్రం వుంచారు. తీసేస్తే మళ్లీ లేని పోని గ్యాసిప్ లు వస్తాయి అని.

సినిమా టీజర్ ఇటీవల విడుదల చేసారు. మంచి అప్లాజ్ వచ్చింది. పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. అందువల్ల కనీసం 80 కోట్లకు పైగా మార్కెట్ కావాలి. థియేటర్ , నాన్ థియేటర్ కలిపి. అప్పుడే నిర్మాత అనిల్ సుంకర సేఫ్ అవుతారు. 

నేను రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే...

జ‌గ‌న్ ను చూసి నేను మారను