cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

Me Too: ఐశ్వర్యరాయ్ వర్సెస్ సల్మాన్!

 Me Too: ఐశ్వర్యరాయ్ వర్సెస్ సల్మాన్!

Me Too.. వ్యవహారం అటు తిరిగి, ఇటు తిరిగి బాలీవుడ్ లో రసవత్తరంగా మారుతూ ఉంది. దీనిపై కొందరు హీరోయిన్లు స్పందిస్తున్న తీరు ఆసక్తిదాయకంగా మారింది. ఇక నెటిజన్లు కూడా ఈ విషయంపై స్పందిస్తున్నారు. పనిలో పనిగా కొన్ని పాత వ్యవహారాలను కూడా కదిలిస్తూ ఉన్నారు. అంటే గతంలో ఈ తరహా ఆరోపణలు చేసిన వారి ప్రస్తావన వస్తూ ఉంది.

ఇందులో ఐశ్వర్యరాయ్ వర్సెస్ సల్మాన్ ఖాన్ వ్యవహారం కూడా ఉండటం గమనార్హం. గతంలో సల్మాన్ మీద ఐశ్వర్య సంచలన ఆరోపణలు చేసింది. అతడు తనపై భౌతిక దాడికి దిగినట్టుగా ఐశ్వర్య వ్యాఖ్యానించింది. సల్లూ తనను కొట్టాడని ఆమె ఆరోపించింది. అప్పట్లో ఈ వ్యవహారాన్ని ఇద్దరు మాజీ ప్రేమికుల మధ్య గొడవగా చూశారంతా. అయితే ఇప్పుడు దీన్ని కూడా ‘మీ టు’లో భాగం చేసేస్తున్నారు నెటిజన్లు.

ఈ విషయంలో గతంలో స్పందించిన తీరును కూడా వీడియోల రూపంలో పోస్టు చేస్తున్నారు. ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో ఈ విషయంపై సల్లూ స్పందించాడు. ఐశ్వర్యరాయ్ ను మీరు కొట్టారంట కదా.. అని ఒక మహిళా జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సల్మాన్ ఘాటుగా స్పందించాడు.

తను ఒక అమ్మాయిని ద్వేషించి కొట్టానంటే ఆమె బతికే అవకాశమే లేదన్నట్టుగా సల్లూ చెప్పాడు. ప్రభుచావ్లా ఒకసారి ఇదే ప్రశ్న అడిగితే తను టేబుల్ ను బలంగా కొట్టానని, టేబుల్ విరిగిపోయిందని.. అలాంటిది తను ఒక అమ్మాయిని కొడితే తను తట్టుకుని మళ్లీ మాట్లాడగలదా? అని సల్లూ ప్రశ్నించాడు.

చూశారా.. సల్మాన్ ఎంత దారుణంగా మాట్లాడాడో.. అంటూ నెటిజన్లు అంటున్నారు. సల్మాన్ ఇంటర్వ్యూ కూడా చాలాపాతదే. దీన్ని ఆధారంగా చేసుకుని కొత్త మంటపుట్టేలా ఉంది. ఇక మీ టు గురించి ఐశ్వర్యరాయ్ మాట్లాడుతూ.. తను గతంలో ఈ తరహా విషయాలను ఓపెన్ గా చెప్పానని.. అంది. ఇక హీరోయిన్లు వ్యక్తిగతంగా చేస్తున్న ఆరోపణల గురించి స్పందించడానికి ఆమె నిరాకరించింది.