ఐశ్వర్య – అభిషేక్.. బంధం కష్టాల్లో పడుతోందా?

ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్ బంధం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందా? ఐష్ తీరే ఇందుకు కారణమా? ప్రొఫెషనల్ గా స్వతంత్రమైన జీవితాన్ని గడపడానికి ప్రాధాన్యం ఇస్తున్న ఐష్ ను చూస్తుంటే.. ఈ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి…

ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్ బంధం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందా? ఐష్ తీరే ఇందుకు కారణమా? ప్రొఫెషనల్ గా స్వతంత్రమైన జీవితాన్ని గడపడానికి ప్రాధాన్యం ఇస్తున్న ఐష్ ను చూస్తుంటే.. ఈ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి బాలీవుడ్ వర్గాల నుంచి. ప్రత్యేకించి నటిగా సెకెండ్ ఇన్నింగ్స్ లో ఐష్ తీరు బచ్చన్ల ఫ్యామిలీలో ఇబ్బందులను సృష్టిస్తోందని ఆ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

ఇప్పటికే ఐష్ నటించే సినిమాల విషయంలో అమితాబ్ జోక్యం చేసుకునేంత వరకూ వచ్చింది పరిస్థితి అనే మాట వినిపించింది. రణ్ బీర్ కపూర్ తో ఐష్ రొమాన్స్ విషయంలో బిగ్ బి అసంతృప్తి బయటపడిపోయింది.

కోడలు సెకెండ్ ఇన్నింగ్స్ లో ప్రధాన పాత్రలో నటించిన సినిమా  గురించిన సమాచారాన్ని ఉత్సాహంగా షేర్ చేసిన ఆయన ఆమె రణ్ బీర్ తో రొమాన్స్ లో మునిగిన సినిమాను అసలు పట్టించుకోలేదు. దీంతోనే అమితాబ్ అసంతృప్తి బయటపడిపోయింది.

అలాగే ఇంతకుముందే.. ఐష్- జయ బాదురీల మధ్య విబేధాలు తలెత్తాయనే ప్రచారం జరిగింది. ఇంతకు మించిన సంచలనం ఏమిటంటే.. సల్మాన్ సరసన నటించడానికి ఐష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనేది! ఆ హీరోతో ఐష్ గొడవ ఏమిటో… ఎందుకో.. వేరే వివరించనక్కర్లేదు.

ఆ వివాదాలు తలెత్తి దశాబ్దం గడిచిపోయినా సల్లూతో ఐష్ ముట్టనట్టుగానే ఉంది. అంతకు ముందు సల్లూతో క్లోజ్ గానే ఉండిన బచ్చన్ ఫ్యామిలీ కూడా, ఐష్ ను కోడలిగా చేసుకున్న తర్వాత అతడితో  పడనట్టుగానే వ్యవహరిస్తోంది. దీనికంతటికీ కారణం.. సల్లూ- ఐష్ ల ప్రేమ, పర్యవసనాలే!

మరి అంత జరిగిన తర్వాత.. దశాబ్దం నుంచి కనీసం ఎదురుపడకుండానే గడిపేస్తున్న తరుణంలో.. బచ్చన్ల ఫ్యామిలీ సల్మాన్ పేరు ఎత్తకుండా గడిపేసిన తరుణంలో.. కొన్ని పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

ఐష్ తాజా సినిమా విషయంలో సల్మాన్ ఆసక్తిని ప్రదర్శించాడనే వార్తలు, ఆ సినిమా ప్రివ్యూలో ఐష్ ను చూసి అతడు మెస్మరైజ్ అయిపోయాడు అనే మాటలు.. సల్లూతో నటించి, తన కెరీర్ ను మళ్లీ ఉరకలెత్తించాలని ఐష్ భావిస్తోందనే వార్తలు.. అభిషేక్- ఐష్ ల దాంపత్యంపై ప్రభావం చూపించే అవకాశం ఉందని బాలీవుడ్ సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.