రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పటి డార్లింగ్ హీరోయిన్ ఆఫ్ టాలీవుడ్ అన్న రేంజ్ లో సినిమాలు చేసేస్తోంది. ఈ హీరో, ఆ హీరో అని లేదు. దాదాపు అందరు హీరోలను చుట్టేస్తూ వస్తోంది. అలాంటి హీరోయిన్ అక్కినేని అఖిల్ ను మాత్రం, మంచోడు, నాకు డార్లింగ్ అని అంటూనే, తన తమ్ముడి వయసు వాడు అనేసింది.
ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఇండస్ట్రీలోని చాలా మంది గురించి రకుల్ మాట్లాడింది. అందరికన్నా, ప్రకాశ్ కోవెలమూడి (సైజ్ జీరో డైరక్టర్) తనకు అత్యంత సన్నిహితుడు, ఇష్టుడు అని చెప్పడమే కాదు, తనకు బాయ్ ఫ్రెండ్ అంటూ వస్తే, అతగాడిని ముందుగా ప్రకాశ్ దగ్గరకు ట్రయినింగ్ కు పంపిస్తా అని చెప్పేసింది.
రవితేజను మాత్రం రవిగారు అంటానని, నాని చాలా డెడికేటెట్ అండ్ సిన్సియర్ అని, రానా మాంచి హోస్ట్ అని, రాశీ ఖన్నా సైలెంట్ అని, లక్ష్మి తనకు అమ్మలాంటిదని, చాలా కేర్ తీసుకుంటుందని రకుల్ వివరించుకు వచ్చేసింది. అందరి గురించి చెప్పింది కానీ, ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో ఫ్రెండ్ గా వున్నా సందీప్ కిషన్ గురించి మాత్రం ఒక్క ముక్క కూడా చెప్పలేదు ఎందుకో?