Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అనిల్ రావిపూడికి వెయిటింగ్ బాధలు

అనిల్ రావిపూడికి వెయిటింగ్ బాధలు

ఎంత హిట్ ఇచ్చాం అన్నది కాదు క్వశ్చను, తరువాత సినిమాకు హీరో ఎవరైనా రెడీగా వున్నారా లేదా అన్నది పాయింట్. మనకు వున్న టాప్ హీరోలే అరడజను మంది. వీరే త్రివిక్రమ్, కొరటాల, సుకుమార్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి ఇలా టాప్ లైన్ డైరక్టర్లు అందరికీ కావాలి. ఇక మిడ్ రేంజ్ డైరక్టర్ల సంగతి చెప్పక్కరలేదు. అందువల్ల హీరోలు కాదు, అసలు డైరక్టర్లు ఏడాదికి ఓ సినిమా చేయగలరా? అన్నది అనుమానం. 

కొరటాల శివ రెండేళ్ల నుంచి ఒకే సినిమా మీద వున్నారు. మిగిలినవారంతా అసలు సినిమా ఎక్కించకుండానే దాదాపు తొమ్మిది పది నెలల నుంచి ఖాళీ. త్రివిక్రమ్, సుకుమార్ సినిమాలు ఫిక్స్ అయి కూడా వెయిటింగ్.  వంశీ పైడిపల్లి సరైన స్క్రిప్ట్ లేక ఖాళీ. అనిల్ రావిపూడి అలా కాదు. ఎఫ్ 3 స్క్రిప్ట్ రెడీ అయిపోయి కూడా వెయిటింగ్ నే.

ఆయన  ఎఫ్ 3 సినిమా చేసేలోగా తన పర్యవేక్షణలో ఓ చిన్న సినిమా నాలుగు స్థంభాలాట చేసేద్దాం అనుకున్నారు. కానీ దానికీ ఇద్దరు మిడ్ రేంజ్ హీరోలు కావాలి. ఎక్కడ దొరుకుతారు. ఆ సినిమాకు డైరక్టర్ గా నక్కిన త్రినాధరావు అనుకున్నారు. కానీ ఈ గ్యాప్ భరించలేక ఆయన కూడా జారుకుంటున్నారని బోగట్టా. దాంతో ఇక ప్రాజెక్టును దాదాపు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. 

నేరుగా ఎఫ్ 3 మీదకే అనిల్ రావిపూడి వెళ్తారు. ఆ తరువాత మహేష్ బాబుతో సినిమా చేయాల్సి వుంది. కానీ ఈలోగా మహేష్ బాబుతో భీష్మ డైరక్టర్ వెంకీ కుడుముల సినిమాను సెట్ చేయాలని ఓ డైరక్టర్ ప్రయత్నిస్తున్నారు. సినిమాలు కుదర్చడంలో బిజీగా వున్న ఆయన ప్రస్తుతం ఈ పని పెట్టుకున్నారు. మరి అది ఫిక్స్ అయితే ఎఫ్ 3 తరువాత కూడా అనిల్ రావిపూడి వెయిటింగ్ లో వుండాలేమో?

రైతుల్ని భ్రమల్లోనే ఉంచుతున్న బాబు 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?