Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అంజలి ని వదల్లేదుగా

అంజలి ని వదల్లేదుగా

నిర్మాత దిల్ రాజు తన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మాంచి చాన్స్ ఇచ్చారు అంజలికి. ఆ సినిమా చాలా ప్లస్ అయింది.అంజలి కెరీర్ కు. ఆ తరువాత చాలా సినిమాలు చేసినా పెద్దగా పేరు రాలేదు. 

మళ్లీ ఇన్నాళ్లకు వకీల్ సాబ్ లో మళ్లీ నిర్మాత దిల్ రాజే చాన్స్ ఇచ్చారు. సినిమా బడ్జెట్ కోసం తీసుకున్నారు అనుకున్నారు. కానీ అంజలి ఆ క్యారెక్టర్ కు బాగా ఫిట్ అయింది. మంచి పేరు వచ్చింది.

ఇప్పుడు మళ్లీ వరుసగా చాన్స్ లు వస్తాయో రావో అన్నది అలా వుంచితే నిర్మాత దిల్ రాజే ముచ్చటగా మాంచి మూడో చాన్స్ కూడా ఇచ్చేసారు. అనిల్ రావిపూడి-వెకటేష్-వరుణ్ ల కాంబినేషన్ లోతయారవుతున్న ఎఫ్ 3 సినిమాలో మూడో హీరోయిన్ క్యారెక్టర్ వుంది. 

ఈ క్యారెక్టర్ కు సోనాలీ చౌహాన్ ను తీసుకున్నారు. కానీ ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో ఆమె రావడం, చేయడం అన్నది అయోమయంలో పడింది. దాంతో అర్జెంట్ గా డెసిషన్ మార్చుకుని అంజలిని తీసుకున్నారు. 

అంజలి డేట్ లు రెడీగా వున్నాయి. అందుకే త్వరలో ఛలో మైసూర్ అంటున్నారు టీమ్ అంతా. మొత్తానికి అంజలి సెకెండ్ ఇన్నింగ్స్ వకీల్ సాబ్ తో స్టార్ట్ అయినట్లుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?