Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అనుష్క..ఇప్పుడు శ్రియ

అనుష్క..ఇప్పుడు శ్రియ

ఎప్పుడో సిరిసిరిమువ్వ సినిమాలో హీరోయిన్ జయప్రద మూగ క్యారెక్టర్ చేస్తే అదో సంచలనం. హీరోయిన్ కు మాటలు రాని క్యారెక్టర్ అంటూ. ఆ తరువాత రకరకాల ప్రయోగాలు అలవాటైపోయాయి. ఇప్పుడు లేటెస్ట్ గా నిశ్శబ్దం సినిమాలో హీరొయిన్ అనుష్క మూగ క్యారెక్టర్ చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా అనుష్క అమెరికన్ సైన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంది. ఇండియన్ సైన్ లాంగ్వేజ్ కు అమెరికన్ సైన్ లాంగ్వేజ్ కు తేడా వుంటుంది. నిశ్శబ్దం సినిమా  అమెరికా నేపథ్యంలో వుండడంతో, ఆ సైన్ లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేసి మరీ నటించారు అనుష్క.

సరే ఆ సంగతి కూడా అలా వుంచితే నటి శ్రియ కూడా ఓ మూగ పాత్ర చేసేస్తున్నారు. గమనం అనే మల్టిపుల్ లాంగ్వేజ్ సినిమాలో శ్రియ చేస్తున్నది కూడా మూగపాత్రే నంట. సినిమాలో మూడు కథలు, మూడు వెరైటీ పాత్రలు వుంటే అందులో మూగ పాత్ర శ్రియ చేస్తుండగా, మరో రెండు పాత్రలను మరో హీరోయిన్, ఇంకా శివ కందుకూరి చేస్తున్నారట.

మొత్తానికి  ఇప్పడు ట్రెండ్ మారుతోంది. హీరోయిన్ల కోసం కూడా కొత్త కొత్త తరహా క్యారెక్టర్లు సృష్టిస్తున్నారు. కీర్తి సురేష్ రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో చేస్తున్నారు. రెండూ కూడా విభిన్నమైనవే.

విశాఖ వస్తా, అందరినీ కలుస్తా

ఈ పెద్ద మనిషి ఇక మారడా 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?