Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

క్రేజీ రిలీజ్ డేట్.. మళ్లీ ఖాళీ అవుతోంది

క్రేజీ రిలీజ్ డేట్.. మళ్లీ ఖాళీ అవుతోంది

ఏప్రిల్ 27.. ఈ డేట్ చెప్పగానే మదిలో మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలు గుర్తొస్తాయి. ఈ డేట్ కోసం ఈ రెండు సినిమాలు ఏ రేంజ్ లో పోటీపడ్డాయో, ఎలాంటి వివాదాలు రేపాయో అందరికీ తెలిసిందే. ఫైనల్ గా పెద్దలు కుదిర్చిన ఒప్పందం ప్రకారం.. ఆ డేట్ నుంచి రెండు సినిమాలూ తప్పుకున్నాయి. రజనీకాంత్ కాలాకు ఆ తేదీని కేటాయించారు. అయితే ఆశ్చర్యకరంగా ఇప్పుడా తేదీ మళ్లీ ఖాళీ అవుతోంది. కావాలంటే మహేష్ లేదా బన్నీ అ తేదీకి రావొచ్చు.

అవును.. రజనీకాంత్ కాలా సినిమా ఆ తేదీకి దాదాపు రానట్టే. దీనికి కారణం తమిళనాట కొనసాగుతున్న థియేటర్ల బంద్. ఒకవేళ బంద్ ను ఎత్తేస్తే.. మార్చి 1 నుంచి వాయిదాపడుతూ వస్తున్న సినిమాల్ని రోస్టర్ పద్ధతిలో విడుదల చేయాలని నడిగర్ సంఘం నిర్ణయించింది. అంటే.. ఏ సినిమాకు ఫస్ట్ సెన్సార్ పూర్తయితే ఆ సినిమా ముందుగా థియేటర్లలోకి వస్తుందన్నమాట.

ఇలా చూసుకుంటే.. ఇప్పటివరకు దాదాపు 20 సినిమాలు క్యూలో ఉన్నాయి. సో.. రజనీకాంత్ కాలా సినిమా చెప్పిన టైమ్ కు రావడం దాదాపు అసాధ్యమని తేలిపోయింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 27న ఒకేసారి విడుదల చేద్దామనుకున్న ఈ సినిమా విడుదల మే నెలకు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అదే కనుక జరిగితే ఏప్రిల్ 27 మళ్లీ ఖాళీ అవుతుంది. ఏప్రిల్ 20న వస్తున్న భరత్ అనే నేను సినిమాకు బాక్సాఫీస్ లో మరో వారం గ్యాప్ దొరుకుతుంది. ఇక మే 4న వస్తుందనుకున్న నా పేరు సూర్య సినిమాను కావాలనుకుంటే ఏప్రిల్ 27న విడుదల చేసుకోవచ్చు. మరి మొదట్నుంచి ఏప్రిల్ 27 కోసం పట్టుబట్టిన బన్నీ నిర్మాతలు తిరిగి ఆ తేదీకి వస్తారేమో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?