Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అర్జున్ రెడ్డి రీమేక్.. ఇది ఓవర్‌గా లేదూ?

అర్జున్ రెడ్డి రీమేక్.. ఇది ఓవర్‌గా లేదూ?

ఒక సంచలన సినిమాను రీమేక్ చేయడం అంటే మాటలు కాదు.. ఒక భాషలో ఊహించని విధమైన హిట్‌ను అందుకున్న సినిమాను రీమేక్ చేయడమే పెద్ద సాహసం. కల్ట్ హిట్స్ గా నిలిచిన చిన్న సినిమాలు, ఎవ్వరూ ఊహించని విజయాన్ని అందుకున్న సినిమాలు రీమేక్ అయ్యాకా.. ఒరిజినల్ స్థాయి హిట్‌ను అందుకోవడం అటుంచి, డిజాస్టర్స్ గా నిలిచిన సందర్భాలే ఎక్కువ. ఒరిజినల్ లో కనిపించిన ఫీల్.. రీమేక్ వెర్షన్లలో కనిపించకపోవడం, ఒరిజినల్‌కు కుదిరినట్టుగా రీమేక్‌కు అన్నీ కుదరకపోవడం.. వంటి రీజన్లతో ఇలాంటి సినిమాలు బోల్తా కొట్టేస్తూ ఉంటాయి.

సినీ చరిత్రను పరిశీలిస్తే.. ఒక భాషలో సంచలనం రేపిన సినిమాలు మరో భాషలో రీమేక్ అయ్యి ఫ్లాప్ అయిన సందర్భాలు ఎన్నో కనిపిస్తాయి. తయారు చేస్తే అది పెద్ద జాబితానే అవుతుంది. తెలుగు సంచలనం ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ వెర్షన్ టీజర్‌ పై కూడా ఈ కామెంట్లే వినిపిస్తున్నాయి. విక్రమ్ తనయుడు హీరోగా అర్జున్ రెడ్డి తమిళంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ‘వర్మ’గా టీజర్ కూడా వచ్చేసింది. అర్జున్ రెడ్డి తెలుగు వెర్షన్‌ను చూసిన జనాలు ఈ తమిళ వెర్షన్ ను గేలి చేస్తున్నారు. ఇదొట్టి పేరడీలా ఉందని తేల్చేస్తున్నారు. అయితే దర్శకుడు బాల కావడంతో ఇంకా నమ్మకాలు మిగిలే ఉన్నాయి.

గతంలో ‘ప్రేమమ్’ తెలుగు రీమేక్ టీజర్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. అయితే తెలుగు వెర్షన్ విడుదల అయ్యాకా ఆకట్టుకుంది. ఇలాచూస్తే ‘వర్మ’ ఓకే కానీ, ఆ సినిమాను మళ్లీ తెలుగులోకి డబ్ చేస్తుండటమే ఓవర్ గా ఉంది. విక్రమ్ తనయుడిని తెలుగులో కూడా లాంఛ్ చేసుకోవాలనుకోవడం ఓకే కానీ, ఆల్రెడీ తెలుగులో ఒక కల్ట్ హిట్ అయిన సినిమాను రీమేక్ చేస్తూ.. దాన్ని మళ్లీ తెలుగు వాళ్లకు చూపించాలనుకోవడం మాత్రం ఓవర్.

తమిళ అతి అంటే ఇలాగే ఉంటుంది. మరి ఇలా రీమేక్ చేస్తూ ఒరిజినల్ కు న్యాయం చేయకుండా.. మళ్లీ తెలుగు వాళ్లకు చూపించాలని చూస్తుండటం విక్రమ్ అండ్ కంపెనీ వెర్రితనమే అవుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?