ఏటిటి దారిలో తేజ

సీత సినిమా ఘోరపరాజయం తరువాత మళ్లీ సినిమా సెట్ మీదకు తీసుకెళ్లడానికి రకరకాల సన్నాహాలు చేసుకుంటున్నారు డైరక్టర్ తేజ. ఒక ప్రాజెక్ట్ అయితే పక్కాగా వుందని వార్తలు అందుతున్నాయి. కానీ కరోనా అడ్డంకి వుండనే…

సీత సినిమా ఘోరపరాజయం తరువాత మళ్లీ సినిమా సెట్ మీదకు తీసుకెళ్లడానికి రకరకాల సన్నాహాలు చేసుకుంటున్నారు డైరక్టర్ తేజ. ఒక ప్రాజెక్ట్ అయితే పక్కాగా వుందని వార్తలు అందుతున్నాయి. కానీ కరోనా అడ్డంకి వుండనే వుంది. ఇలాంటి నేపథ్యంలో గురువు ఆర్జీవీ చూపించిన బాటలో ముందు వెళ్లాలని తేజ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

గురువు రామ్ గోపాల్ వర్మ బూతు, సెన్సెషన్ సబ్జెక్ట్ లు తీసుకుని, విడియో క్లిప్ ల మాదిరిగా సినిమా క్లిప్స్ లాంటి మైక్రో సినిమాలు తీసి ఏటిటి లో విడుదల చేస్తున్నారు. ఇప్పుడు తేజ కూడా ఇదే దారిలోకి వెళ్లున్నారట. ఆయన కూడా శ్రేయాస్ ఇటి లో ఓ థియేటర్ తీసుకుని, అందులో సినిమాలు ప్రదర్శించబోతున్నారు.

తేజ సైబర్ క్రయిమ్, డిజిటలైజేషన్ సమస్యలు వంటి పాయింట్లు తీసుకుని, సినిమాలు చేసే సన్నాహాల్లో వున్నట్లు తెలుస్తోంది. అయితే గురువు ఆర్జీవీ మాదిరిగా కాకుండా,  కాస్త నిడివి వున్న ఇండిపెండెంట్ సినిమాలు తీసి విడుదల చేస్తారని తెలుస్తోంది.

ఏపీ స‌ర్కార్ తాజాగా హెచ్చ‌రిక

నా మాదిరి ఏ నిర్మాతా సంపాదించలేదు