'దేవసేన' అనుష్క కీలకపాత్రలో నటించిన సినిమా నిశ్ళబ్దం. పీపుల్స్ మీడియా పతాకంపై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా ఒటిటి లోకి వస్తుందని ఏప్రియల్ నుంచి వినిపిస్తోంది. కానీ వచ్చేది కనిపించడం లేదు. అయితే తాజా సమాచారం ఏమిటంటే, ఈ సినిమాకు ఇన్నాళ్లు పెండింగ్ లో వున్న సిజి వర్క్ అంతా పూర్తి అయిందని, ఇక త్వరలో ఫైనల్ కాపీ వస్తే, అమెజాన్ తో అగ్రిమెంట్ అవుతుందని తెలుస్తోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నిశ్శబ్దం సినిమా ఆగస్టులో అమెజాన్ ప్రయిమ్ లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. ముందుగా అగ్రిమెంట్ కావాలి. ఆ తరవాత మెయిన్ స్ట్రీమ్ సినిమాకు పబ్లిసిటీ చేసిన రీతిగానే దీనికి కూడా ప్రచారం నిర్వహించే అవకాశం వుంది. అందుకోసం రెండు మూడు వారాల టైమ్ పడుతుంది.
కంటెంట్ విడుదల, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ మామూలుగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే ప్రీ రిలీజ్ మీట్ హడావుడి లేకున్నా, కనీసం వర్చ్యువల్ ఫంక్షన్ లాంటిదన్నా చేయాలి. మొత్తం మీద ఒటిటి లోకి వచ్చే తొలి పెద్ద సినిమా ఇదే అవుతుంది.
రవితేజ క్రాక్ వస్తుందని నిన్నా మొన్నా గ్యాసిప్ లు వినిపించాయి కానీ, అవి నిజం కాదు. ఎందుకంటే ఆ సినిమాకు ఇంకా మూడు పాటలు, కొంత టాకీ పెండింగ్ వుంది. అవన్నీ జరగాలి అంటే లాక్ డౌన్ పూర్తిగా లిఫ్ట్ చేసి, షూటింగ్ లు జరిపే పరిస్థితి రావాలి. అలాంటి పరిస్థితి వస్తే, శర్వానంద్-14 రీల్స్ ప్లస్ శ్రీకారం సినిమా కూడా ఒటిటి లోకి వచ్చే అవకాశం వుంది.