cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

యావరేజ్ మార్కులే..బిగ్ బాస్ ఫస్ట్ డే రిపోర్ట్

యావరేజ్ మార్కులే..బిగ్ బాస్ ఫస్ట్ డే రిపోర్ట్

బిగ్ బాస్ సీజన్ 2 స్టార్ట్ అయింది. ఫస్ట్ సీజన్ ను సూపర్ హిట్ చేసింది హీరో ఎన్టీఆర్ నే. అందులో అణుమాత్రం సందేహం లేదు. దానికి తోడు తొలి సెషన్ లో పాల్గొన్నవారంతా దాదాపు జనాలకు పరిచయం అయినవారే. తొలి సెషన్ తొలి రోజు ఎన్టీఆర్ కూడా యావరేజ్ మార్కులే తెచ్చుకున్నాడు. రాను రాను అదుర్స్ అనిపించుకున్నాడు.

ఇప్పుడు సీజన్ 2 స్టార్ట్ అయింది. హోస్ట్ నాని సంగతి అలా వుంచితే, అసలు షో నే చాలా పేలవంగా స్టార్ట్ అయినట్లు అనిపించింది. సరైన పార్టిసిపెంట్స్ ను సంపాదించలేకపోవడం ఒక కారణం కావచ్చు. పాల్గొనే 16 మందిలో సగానికి పైగా కాస్తో కూస్తో పరిచయం వున్న మొహాలే కానీ, హుషారైనవి కావు. తేజస్విని, శ్యామల మినహా హుషారైన వారు తక్కువ. పార్టిసిపెంట్స్ నే తొలి రోజు షో నీరసంగా వుండడానికి అసలు కారణం.

దానికి తోడు నాని తొలి రోజు చాలా స్లోగా, స్టడీగా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినట్లుంది. ఎన్టీఆర్ సభ్యుల ఎంట్రీనే సూపర్ గా నిర్వహించాడు. నాని చూస్తుంటే, వచ్చిన వాళ్లను వెంట వెంటనే ఇంట్లోకి తోసే పని తప్ప, వాళ్లతో మింగిల్ కావడం కానీ, ఇంట్రాక్ట్ కావడం కానీ అంత చేసినట్లు కనిపించలేదు. 

బిగ్ బాస్ షో రెండురోజులు హోస్ట్ మీద ఆధారపడి వుంటుంది. మిగిలిన రోజులు పార్టిసిపెంట్స్ మీద ఆధారపడి వుంటుంది. ఫస్ట్ సీజన్ లో ఈ రెండూ కూడా పెర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. సరే ఈసారి హోస్ట్ గా నాని ఇంప్రూవ్ చేసుకుంటే రెండు రోజులు ఓకె అవుతుంది. కానీ పార్టిసిపెంట్స్ మిగిలిన రోజులను రంజింపచేయగలరా అన్నది సందేహం. అది మరో రెండు రోజులు చూస్తే తేలిపోతుంది.