బాహుబలికా? ప్రభాస్ కా? క్రెడిట్?

టాలీవుడ్ లో చాలా సార్లు ఇలాగే జరుగుతుంది. కష్టం ఎవరో పడతారు. క్రెడిట్ ఎవరో కొట్టేస్తారు. మేడమ్ టస్సాడ్ మ్యూజియమ్ లో విగ్రహం ఏర్పాటు విషయంలో జరిగింది ఇదే. మేడమ్ టస్సాడ్ లో పెడుతున్నది…

టాలీవుడ్ లో చాలా సార్లు ఇలాగే జరుగుతుంది. కష్టం ఎవరో పడతారు. క్రెడిట్ ఎవరో కొట్టేస్తారు. మేడమ్ టస్సాడ్ మ్యూజియమ్ లో విగ్రహం ఏర్పాటు విషయంలో జరిగింది ఇదే. మేడమ్ టస్సాడ్ లో పెడుతున్నది బాహుబలి విగ్రహమా? ప్రభాస్ విగ్రహమా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే మేడమ్ టస్సాడ్ మ్యూజియమ్ నిర్వాహకులు బాహుబలి విగ్రహం పెడతామని, బాహుబలి సినిమా టీమ్ తో అగ్రిమెంట్ చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. ప్రభాస్ విగ్రహం పెట్టాలి అంటే అగ్రిమెంట్ ప్రభాస్ తో చేసుకోవాలి కదా?

లేదా బాహుబలి కాస్ట్యూమ్స్ లో వున్న ప్రభాస్ విగ్రహం పెడతారేమో? అంటే అప్పుడు బాహుబలి టీమ్ తో ఆ గెటప్ కోసం, ప్రభాస్ తో ఆయన ఫేస్ కోసం అగ్రిమెంట్ చేసుకుని వుండాలి. ప్రభాస్ తో అగ్రిమెంట్ చేసుకున్నారా లేదా అన్నది తెలియలేదు. బాహుబలి విగ్రహమే పెడతారు అంటే అప్పుడు క్రెడిట్ మొత్తం దాని సృష్టి కర్త రాజమౌళికి దక్కుతుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించిన బాహుబలి క్యారెక్టర్ ను దృష్టిలో వుంచుకునే మేడమ్ టస్సాడ్ మ్యూజియమ్ ఈ విగ్రహం పెడుతోందని తెలుస్తోంది. కొద్ది రోజులు ఆగి, విగ్రహం రెడీ అయితే ఈ విషయం తెలిసిపోతుంది.

ఇదిలా వుంటే, విగ్రహం కోసం కొలతలు తీసుకునేందుకు వచ్చిన రోజు నుంచే మీడియాకు ఈ విషయం వెల్లడించేయాలని ప్రభాస్ టీమ్ తొందరపడిందని తెలుస్తోంది. కానీ ఈ న్యూస్ ను మ్యూజియమ్ వర్గాలు అధికారికంగా వెల్లడిస్తే బాగుంటుదని రాజమౌళి అండ్ కో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఆఖరికి 5వ తేదీన మ్యూజియమ్ వర్గాలు వెల్లడించే అవకాశం వుందని, ఆ రోజే ఇక్కడా వెల్లడిద్దామని రాజమౌళి డిసైడ్ చేసారట. 

అయితే 2వ తేదీనే ప్రభాస్ ఆఫీసు నుంచి ప్రెస్ నోట్ బయటకు వచ్చేసింది. ఈ విషయం తెలిసి రాజమౌళి కాస్త ఖంగుతిన్నారని వినికిడి. ఆ తరువాత సర్దుకుని, ఈ రోజుల్లో న్యూస్ దాచడం కష్టమైపోతోంది అని ట్వీట్ చేసి ఊరుకున్నారు. 

అదీ విషయం.