Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మాఫియా డాన్ గా బాలయ్య?

మాఫియా డాన్ గా బాలయ్య?

ప్రస్తుతం ఈ హీరో చేతిలో ఎన్టీఆర్ బయోపిక్ ఉంది. దీని తర్వాత బోయపాటి సినిమా కూడా చేయాలి. పూరి జగన్నాధ్ తో మరో సినిమా కమిట్ మెంట్ కూడా ఉంది. ఇన్ని సినిమాల మధ్య బాలయ్య మరో సినిమా చేయబోతున్నాడంటూ ఓ పుకారు ఊపందుకుంది. 

కన్నడలో హిట్ అయిన ముఫ్టీ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తాడట బాలయ్య. కన్నడలో శివరాజ్ కుమార్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాను బాలయ్య రీమేక్ చేస్తాడంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ రీమేక్ సబ్జెక్ట్ ను స్వయంగా దర్శకుడు కేఎస్ రవికుమార్, బాలయ్యకు వినిపించాడట. 

ఇందులో హీరోది మాఫియా డాన్ పాత్ర. అక్కడక్కడ కాస్త నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. జూన్ 10న తన పుట్టినరోజు సందర్భంగా బాలయ్య ఈ సినిమాను ప్రకటించే ఛాన్స్ ఉందంటున్నారు. బాలయ్య, కేఎస్ రవికుమార్ కాంబోలో జై సింహా వచ్చిన విషయం తెలిసిందే.

ఇక ఎన్టీఆర్ బయోపిక్ విషయానికొస్తే, ఈ సినిమా మార్చి 29న ప్రారంభం అవుతుంది. దీనికి బాలయ్యే స్వయంగా ముహూర్తం పెట్టాడు. ద్వివిఘ్నం ఉండకూడదనే ఉద్దేశంతో మార్చి 30న ఒక రోజు రెగ్యులర్ షూటింగ్ చేయబోతున్నారు. ఒక్క రోజు షూట్ చేసి సినిమాను పక్కనపెడతారు. జులై నుంచి పూర్తిస్థాయిలో మూవీని పట్టాలపైకి తీసుకొస్తారు. ఈ గ్యాప్ లో వెంకీతో సినిమా పూర్తిచేస్తాడు దర్శకుడు తేజ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?