బాలయ్య కోసం తమిళ డైరక్టర్?

సీనియర్ హీరోల్లో మాంచి లైనప్ తో వున్నది బాలకృష్ణ నే. గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి సినిమాలు ఫిక్స్ అయిపోయాయి. గోపీచంద్ మలినేని సబ్జెక్ట్ రెడీ చేస్తున్నారు.  Advertisement అనిల్ రావిపూడి దగ్గర స్క్రిప్ట్…

సీనియర్ హీరోల్లో మాంచి లైనప్ తో వున్నది బాలకృష్ణ నే. గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి సినిమాలు ఫిక్స్ అయిపోయాయి. గోపీచంద్ మలినేని సబ్జెక్ట్ రెడీ చేస్తున్నారు. 

అనిల్ రావిపూడి దగ్గర స్క్రిప్ట్ ఎప్పుడో రెడీగా వుంది. పైగా గతంలో మాదిరిగా ఎవరెవరో నిర్మాతలు కాదు. మైత్రీ మూవీస్, దిల్ రాజు లాంటి పెద్ద బ్యానర్లు. ఇవికాక మరి కొన్ని సినిమాలు కూడా చేయబోతున్నా అని బాలయ్య ఓ జాబితానే చెప్పారు. 

ఇంకా కథలు, డైరక్టర్లు ఫిక్స్ కావాలన్నారు. ఈ నేపథ్యంలో ఓ వార్త వినిపిస్తోంది. బాలయ్య కోసం తమిళ మాస్ డైరక్టర్ ఒకరు రంగంలోకి దిగబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కథ రెడీ చేస్తున్నారని, అది వన్స్ రెడీ కాగానే బాలయ్యకు వినిపిస్తారని టాక్. 

ఈ మధ్య తమిళంలో నిర్మాతలు తగ్గిపోయారు. అక్కడి హీరోలు, డైరక్టర్లు తెలుగు రంగం వైపు చూస్తున్నారు. తెలుగు నిర్మాతలకు ఇక్కడ హీరోలు, డైరక్టర్లు దొరకడం లేదు. అందుకే వీళ్లు అటు చూస్తున్నారు. ఈ పరిణామంలో భాగంగా బాలయ్యతో తమిళ మాస్ డైరక్టర్ కాంబినేషన్ ఫిక్స్ అయ్యేలా వుంది.