Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాలయ్య కు భలే హీరోయిన్

బాలయ్య కు భలే హీరోయిన్

బాలయ్య సినిమాలకు అన్నింటికన్నా కష్టమైన పని హీరోయిన్ ను వెదికి పట్టుకోవడం. అదొక్కడి పూర్తయితే సగం సినిమా అయిపోయినట్లే. ఆ మాటకు వస్తే మెగాస్టార్ కు అదే సమస్య. సీనియర్లకు ఇదే సమస్య. లేటెస్ట్ విషయం ఏమిటంటే బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో తయారు కావాల్సిన సినిమాకు హీరోయిన్ దొరికేసింది.

మొదట్లో చాలా మందిని ట్రయ్ చేసారు. కేథరిన్ పేరు కూడా వినిపించింది. కానీ నో అనేసినట్లు కూడా ఆ వెంటనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆఖరికి మాంచి హీరోయిన్ ను పట్టుకువచ్చారు. జనాలకు అంతగా పరిచయం లేకపోయినా, హీరోయిన్ మెటిరీయల్ అనిపించే అమ్మాయి దొరికేసింది.  

మలయాళ హీరోయిన్ ప్రయాగ మార్టిన్ ను బాలయ్య సరసన నటించడానికి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలుగువారికి పరిచయం వున్న ఉస్తాద్ హోటల్ సినిమాలో చిన్న కామియో పాత్రలో కనిపించింది. మిగిలిన సినిమాలు అన్నీ మలయాళం సినిమాలే. 

వాస్తవానికి బోయపాటి ఒక హీరోయిన్ తో సినిమా తీయరు. మరో కీలకమైన రెండో హీరోయిన్ పాత్ర వుండాల్సిందే. ఆ పాత్రకు ఎవరు ఎంపిక అవుతారో చూడాలి.

నన్నెవడూ పీకలేడు

ఈనాడు,జ్యోతి ప‌ట్టించుకోలేదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?