నందమూరి బాలకృష్ణ రాజకీయ పరిస్డితి మార్పును కోరుకునేలా కనిపిస్తోంది. ఆయనను ఇటు ఎమ్మెల్సీకో లేదా రాజ్యసభకో పంపుతారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో, విజయవాడ నుంచి లోక్ సభకు పోటీకి నిలబెడతారనీ వినిపిస్తోంది. కానీ హిందూపురంలో జరిగిన గడబిడలను దృష్టిలో వుంచుకుని, ఈసారి ప్రత్యక్ష రాజకీయాల కన్నా, పరోక్ష రాజకీయాలకే బాలయ్యను పరిమితం చేస్తారనీ వినిపిస్తోంది.
మరోపక్క పెద్దఅల్లుడు లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. చిన్న అల్లుడు కూడా విశాఖ నుంచి ఎంపీ బరిలోకి దిగుతున్నారు. తాను రాజకీయాల్లోకి వస్తానని, ఎన్నికల్లో పోటీ చేస్తానని చిన్నఅల్లుడు ఈరోజు విశాఖలో క్లారిటీ ఇచ్చేసారు.
అంటే బాలయ్య ఇద్దరు అల్లుళ్లు పోటీచేయాలి. చంద్రబాబు పోటీచేయాలి. బాలయ్య కూడా చేస్తే, మొత్తం ఫ్యామిలీలో నాలుగు టికెట్ లు వారికే ఇచ్చుకోవాలి. ఇలాంటి నేపథ్యంలో బాలయ్యను పరోక్ష ఎన్నికలకు మారుస్తారని టాక్ వినిపిస్తోంది.
పైగా కమ్మ సామాజికవర్గానికి ఇన్ని సీట్లు అని ఎలాగూ లెక్కలు వేసుకుంటారు. వాటిలో నాలుగు వీళ్లకే సరిపోతాయి. బాలయ్య అప్పుడు ఎన్నికలను పట్టించుకోకుండా తన బోయపాటి సినిమాను హ్యాపీగా ఫినిష్ చేసేయవచ్చు.