పాపం, యూ ట్యూబ్ లో భయంకరమైన ఫాలోయింగ్ వుంది బండ్ల గణేష్ కు. అదే ఫాలోయింగ్ మళ్లీ పెద్ద తెరమీద కూడా వస్తుంది అనుకున్నాడు. అందుకే అనిల్ రావిపూడి అడగ్గానే, ఒకప్పుడు భారీ సినిమాలు తీసిన నిర్మాతను అన్న సంగతి కూడా పక్కన పెట్టి, ఓ కామెడీ వేషం వేయడానికి ఒప్పుకున్నాడు. దాంతో ఈ వేషం మీద విపరీతంగా గ్యాసిప్ లు పుట్టుకువచ్చాయి.
తీరా సినిమా చూస్తే, బండ్ల గణేష్ ఆశలు అడియాసలయ్యాయి. జనం ఇదేం వేషం? ఇదేంటీ సంగతి? అంటూ పెదవి విరిచారు. ఇప్పుడు విషయం మీదే బండ్ల గణేష్ తీవ్ర ఆవేదన చెందుతున్నాడు. తన వేషం అంతా సినిమాలో తీసేసారని అంటున్నాడు. ట్రయిన్ ఎపిసోడ్ చాలా వుందని, దాంట్లో తన వేషం చాలా లెంగ్త్ వుందని, అంతా ఫైనల్ కట్ లో ఎగిరిపోయిందని బండ్ల అంటున్నట్లు తెలుస్తోంది.
ట్రయిన్ ఎపిసోడ్ 40 నిమషాలు వుంటుందని ఆది నుంచీ వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్ అవుట్ పుట్ లో అంత లేదు. అంటే బండ్లచెప్పినట్లు ఓ పది నిమషాలు ఎడిటింగ్ లో ఎగిరిపోయి వుంటుంది. ఇలా నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్ యేమో? అంతేగా..అంతేగా.