Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'భవ్య' వివాదం..ఏం జరిగింది?

'భవ్య' వివాదం..ఏం జరిగింది?

భవ్య ఆనంద్ ప్రసాద్ కోటి రూపాయలు తీసుకుని,  లాభాల్లో నాలుగు శాతం వాటా ఇస్తానని మోసం చేసారని కేసు పడింది. టాలీవుడ్ లో ఇది సహజంగానే సంచలనం కలిగించింది. భవ్య ఆనంద్ ప్రసాద్ గురించి తెలిసినవారంతా ఆయన జస్ట్ కోటి రూపాయల కోసం ఇంతవరకు తెచ్చుకుంటారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

కోట్లతో సినిమాల నిర్మాణం, సిమెంట్ ఫ్యాక్టరీ, థియేటర్లు, గేటెడ్ కమ్యూనిటీ కాలనీ నిర్మాణాలు ఇలా అనేక వ్యాపారాలు వున్న ఆనంద్ ప్రసాద్ జస్ట్ కోటి రూపాయలు ఇస్తే నాలుగు శాతం వాటా ఇస్తా అని అనడం, ఆ మేరకు మాట నిలబెట్టుకోకపోవడం, అరెస్ట్ వరకు తెచ్చుకోవడం ఎంత వరకు నిజం అని టాలీవుడ్ జనాలు ఆరా తీస్తున్నారు. 

ఈ విషయంలో భవ్య సిమెంట్స్ లేదా ఆనంద్ ప్రసాద్ సన్నిహిత వర్గాలు చెబుతున్నది వేరుగా వుంది. ఈ కోటి రూపాయల వ్యవహారం వేరు అని అది, హైకోర్టులో వుంది అని అంటున్నారు. కానీ ఓ ప్రజా ప్రతినిధితో వచ్చిన వివాదం ఇలా టర్న్ తీసుకుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. భవ్య ఆనంద్ ప్రసాద్ పరారీలో లేరని, నాలుగు రోజుల క్రితమే అమెరికా వెళ్లారని అంటున్నారు. 

కోర్టు సెలవులు చూసి, భవ్య ఆనంద్ ప్రసాద్ సిటీలో లేని తరుణం చూసి, ఫిర్యాదు చేయడంతో అరెస్టులు జరిగాయని, వీటిని లీగల్ గానే ఎదుర్కొంటామని ఆ వర్గాలు వెల్లడించాయి. మొత్తం మీద వ్యవహారం అంతా చూస్తుంటే జనాలకు తెలియంది ఏదో వుంది, అది ఏమిటో? అన్నది మాత్రం ఆనంద్ ప్రసాద్ వచ్చి చెబితే తప్ప తెలియదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?