Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

భయం కాన్సెప్ట్ తో మంచిరోజులు వచ్చాయి

భయం కాన్సెప్ట్ తో మంచిరోజులు వచ్చాయి

ఏదో ఒక కాన్సెప్ట్ అనుకుని, దాని చుట్టూ కథ అల్లడంలో దర్శకుడు మారుతి స్పెషలిస్ట్. 

మతిమరుపు తో భలే భలే మగాడివోయ్, అతి శుభ్రతతో మహానుభావుడు, అతి మంచితనంతో బాబు బంగారం, అతి ఇగోతో శైలజరెడ్డి అల్లుడు సినిమాలు అందించిన మారుతి ఈసారి అతి భయం అనే కాన్సెప్ట్ ను తీసుకున్నారు.

రాను రాను రోజుల మారుతున్నాయి. సొసైటీలో నేరాలు పెరుగుతున్నాయి. వైరస్ లు పెరుగుతున్నాయి. దీంతో బతుకులు భయం భయంగా మారిపోతున్నాయి. అయితే అయినదానికీ, కాని దానికీ భయపడే ఓ పెద్దాయిన కథతో మారుతి సినిమాచేస్తున్నారు. 

మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో చకచకా తయారైపోతున్న ఈ సినిమాకు 'మంచి రోజులు వచ్చాయి' అనే సాఫ్ట్ టైటిల్ ఫిక్స్ చేసారు.

యువి కాన్సెప్ట్, మారుతి కలిసి నిర్మించే ఈ సినిమాలో సంతోష్ శోభన్ హీరో, మెహరీన్ హీరోయిన్. అతిగా భయపడే పెద్దాయినా అజయ్ ఘోష్ నటిస్తున్నారు. ఈ సినిమాను జూలై ఫస్ట్ వీక్ కు రెడీ చేసి అయితే ఓటిటికి లేదా థియేటర్ కు విడుదల చేసే ఆలోచనలో వున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?