Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ సినిమాలో సమంతతో పాటు మరో హీరోయిన్?

ఆ సినిమాలో సమంతతో పాటు మరో హీరోయిన్?

ఎంతో ఇష్టపడి యు-టర్న్ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోంది సమంత. ఈ సినిమా కోసం ఆమె తన హెయిర్ స్టయిల్ కూడా మార్చుకుంది. ఇప్పుడీ లేడీ ఓరియంటెండ్ మూవీలోకి మరో హీరోయిన్ కూడా వచ్చి చేరింది. అవును.. యూ-టర్న్ రీమేక్ లో భూమిక కూడా నటించబోతోంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఈ సినిమాలో భూమికది ఓ దెయ్యం పాత్ర అని తెలుస్తోంది.

కన్నడలో హిట్ అయిన యు-టర్న్ సినిమా సస్పెన్స్-థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. ఆ మూవీలో దెయ్యంగా రాధికా చేతన్ నటించింది. ఇప్పుడు అదే పాత్ర కోసం భూమికను తీసుకున్నారట. త్వరలోనే దీనిపై ఓ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతోంది. 

ఇటు సమంత, అటు భూమిక ఇద్దరికీ ఇలాంటి హారర్-థ్రిల్లర్ సబ్జెక్టులు కొత్తకాదు. సమంత రాజుగారి గది-2 సినిమా చేసింది. ఇక భూమిక గతంలో రవిబాబు దర్శకత్వంలో ఓ సినిమాలో నటించింది. ఆ అనుభవంతోనే యు-టర్న్ రీమేక్ లో ఓ కీలక పాత్ర పోషించేందుకు ఒప్పుకుందట.

ఇక సినిమా విషయానికొస్తే ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరిగిపోతోంది. ఇప్పటికే అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఓ షెడ్యూల్ పూర్తిచేశారు. మహానటి, రంగస్థలం సినిమాలు కంప్లీట్ అయిపోయాయి కాబట్టి, ఇకపై పూర్తిస్థాయిలో యు-టర్న్ రీమేక్ పైనే ఫోకస్ పెట్టబోతోంది సమంత. తెలుగులో కూడా ఈ సినిమాకు ఇదే టైటిల్ ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఒరిజినల్ వెర్షన్ తెరకెక్కించిన పవన్ కుమారే, రీమేక్ ను కూడా హ్యాండిల్ చేస్తున్నాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?