cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'బిగ్ బాస్' ను బుజ్జగించడానికి ఐదు కోట్లు!

'బిగ్ బాస్' ను బుజ్జగించడానికి ఐదు కోట్లు!

సౌత్ లో బిగ్ బాస్ షో హోస్టుకు ఇచ్చే పారితోషకం తో పోలిస్తే హిందీ హోస్టుకు భారీ పారితోషకం ముడుతూ ఉంది. బిగ్ బాస్ హోస్టుగా గత కొన్నేళ్లుగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొనసాగుతూ ఉన్నాడు. తెలుగులో ప్రతి ఏడాదీ ఒక కొత్త సినీ హీరో ఆ షోను హోస్టు చేస్తూ ఉన్నాడు. హిందీ వెర్షన్ విషయంలో కూడా మొదట్లో హోస్టు మారారు. అయితే సల్మాన్ ఖాన్ ఎంటరయ్యాకా మళ్లీ మార్పు లేదు!

సల్మాన్ ను హిందీ బిగ్ బాస్ ప్రొడ్యూసర్లు అస్సలు వదలడం లేదు. ఈ క్రమంలో పదమూడో సీజన్ నడుస్తూ ఉంది. ఈ సారి బిగ్ బాస్ హౌస్ ఎపిసోడ్లను పెంచాలని నిర్వాహకులు భావిస్తున్నారట. అయితే సల్మాన్ అందుకు మొదట ససేమేరా అన్నట్టుగా తెలుస్తోంది.

తనకు వేరే కమిట్ మెంట్స్ ఉండటంతో..  ఈ షోను ముందుగా అనుకున్న సమయానికి ముగించాలని సల్మాన్ మొదట స్పష్టం చేశారట. అయితే ఆయనను చల్లబరచడానికి, తమకు మరిన్ని డేట్స్ కేటాయించేందుకు భారీ పారితోషకాన్ని అందించడానికి రెడీ అయ్యారట నిర్వాహకులు. ఐదు వీకెండ్స్ షూటింగ్స్ కోసం మొత్తం  రెండు కోట్ల రూపాయలను ఆఫర్ చేశారట వారు.

దీంతో వేరే కమిట్ మెంట్స్ ను వాయిదా వేసుకుని, బిగ్ బాస్ షోకు సమయం కేటాయించడానికి సల్మాన్ ఓకే చెప్పినట్టుగా సమాచారం. పది ఎసిసోడ్స్ కోసం ఏకంగా ఐదు కోట్ల రూపాయల పారితోషకం అంటే.. ఇది ఏ రేంజ్ పారితోషకమో అర్థం చేసుకోవచ్చు. తెలుగు, కన్నడ, తమిళ బిగ్ బాస్ హోస్టులకు మాత్రం ఈ స్థాయి పారితోషకాలు లేవనేది బహిరంగ సత్యమే!

 


×