ఫిఫ్టీలకు దగ్గర పడినా, ఫిప్టీ క్రాస్ చేసినా, సినిమా హీరోలుగా చలామణీ కావడం అన్నది ఇప్పుడు టాలీవుడ్ లో అంత వీజీ కాదు. స్వంత డబ్బులు, ప్రొడక్షన్ హవుస్ లు, స్టూడియోలు వుంటే ఒకె. లేదంటే సినిమాలు అంత సులువుగా రావు.
బెంగాల్ టైగర్ లాంటి రీజనబుల్ హిట్ ఇచ్చిన తరువాత ఇప్పటి దాకా సినిమా లేదు హీరో రవితేజ నుంచి. తన రెమ్యూనిరేషన్ తగ్గించడు, బడ్జెట్ రేంజ్ కు సినిమా కలెక్షన్లు వుండవు అని ఇండస్ట్రీ టాక్.
దిల్ రాజు, రంజిత్ మూవీస్ రెండూ సినిమా ప్లాన్ చేసి పక్కకు వెళ్లాయి. సరే, ఆ కొత్త డైరక్టర్ ను, ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి, పవన్ కళ్యాణ్ కు సర్దార్ లాంటి డిజాస్టర్ ఇచ్చినా, గతంలో తనకు హిట్ ఇచ్చాడన్న ఆలోచనతో బాబీని డైరక్టర్ గా కొత్త ప్రాజెక్టుకు ఓకె చెప్పాడు.
చుట్టాలబ్బాయి వంటి లాస్ మేకింగ్ మూవీ అందించిన నిర్మాత రవితేజతో అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నారు. కానీ ఇండస్ట్రీ తాజా ఖబర్ ఏమిటంటే, ఆ ప్రాజెక్టు కూడా అటకెక్కేసిందని. కారణాలు ఇదమిద్దంగా తెలియలేదు కానీ, ప్రాజెక్టు అయితే ఆగిపోయిందన్న వార్తలు ఇండస్ట్రీలో గుప్పు మంటున్నాయి.
రాకరాక వచ్చిన ఒక్క ప్రాజెక్టు కూడా ఆగిపోతే, ఇక రవితేజ సినిమా ఇప్పట్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేనట్లే. రవితేజ సంగతి సరే, కొన్నాళ్లపాటు ఇండస్ట్రీలో వున్నారు. కానీ తొలి సినిమా తరువాత ఎకాఎకి పవన్ సినిమా చాన్స్ కొట్టేసి, ఆపై అలా ఆగిపోయిన బాబీ కెరీర్ సంగతేమిటో పాపం.